కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లను నిరాకరించినందున రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. సేకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నది. మద్దతు ధర క్వింటాలుకు రూ.1,960తో కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా నిఘా ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం భోరజ్.. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్తరోడాతోపాటు ఇతర ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఆదిలాబాద్, ఏప్రిల్ 21 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో యా సంగిలో 68 వేల ఎకరాల్లో రైతులు వరిపంటను సాగు చేయగా, 1.50 లక్షల మెట్రిక్ ట న్నుల దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. నిబంధనల ప్రకారం వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉండగా, తెలంగాణ అభివృద్ధిని చూ సి ఓర్వలేని బీజేపీ సర్కారు పంట సేకరణను నిరాకరించింది.
రాష్ట్ర ప్రభుత్వం పలు విజ్ఞప్తులు చేసినా, రాష్ట్ర మంత్రుల బృందం కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ను కలిసినా ఫలితం లేకుండా పో యింది. కేంద్ర ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో దీక్ష చేపట్టినా బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించింది. దీంతో వరి సాగు చేసిన రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే వడ్లను కొనుగో లు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెండు జిల్లాల్లోని రైతుల నుంచి మద్దతు ధర క్వింటాలుకు రూ. 1960తో ధాన్యాన్ని సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 25 నుంచి నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వివిధ శాఖల అధికారులు, మిల్లర్లు, లారీ య జమానులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. రైతులకు ఇబ్బందుల్లేకుం డా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రభు త్వం గ్రామాల్లోనే కాంటాలు ఏర్పాటు చేసి వడ్లను కొనుగోలు చేయనుండగా, రెండు జిల్లాలో 200 కేంద్రాల్లో పంట సేకరణ జరగనున్నది. రెండు జిల్లాలకు సరిహద్దులో మహారాష్ర్టాలోని పలు గ్రామాలకు చెందిన రైతులు వరిని పండిస్తారు.
అక్కడ వడ్ల ధర తక్కువగా ఉండడంతో దళారులు మన రాష్ట్రంలో మ ద్దతు ధరకు పంటను విక్రయించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భా గంగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు చెక్‌పోస్టుల్లో 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వడ్ల వాహనాలను మన రాష్ట్రంలోని రాకుండా అడ్డుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం భోరజ్, నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్తరోడతో పాటు ఇత ర ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి వడ్లతో వచ్చే వాహనాలు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా జైనథ్ మండలం భోరజ్ వద్ద చెక్‌పోస్టును ఏర్పాటు చేశాం. పోలీస్, రెవెన్యూ, పౌ రసరఫరాలు, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ సిబ్బంది చెక్‌పోస్టుల్లో 24 గంటల పాటు విధు లు నిర్వహిస్తారు. వేరే రాష్ర్టాల నుంచి వడ్లతో వచ్చే వాహనాలను తిరిగి పంపుతారు. ధా న్యం సేకరణ ముగిసేవరకు ఈ చెక్‌పోస్టు ఉంటుంది.
– సుదర్శన్, డీఎస్వో, ఆదిలాబాద్