నిర్మల్ చైన్‌గేట్, మే 9 : ప్రభుత్వ దవాఖాన ల్లో రోగులకు మెరుగైన సేవలు అందించాలని వై ద్యులను నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల బృందం మంగళవారం జిల్లాకు రానున్న దృష్ట్యా నిర్మల్ ప్రధాన దవాఖా న, ఎంసీహెచ్‌ను సోమవారం సందర్శించారు. సేవలు, వసతులపై రోగులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చిన్న పిల్లల తల్లులతో మాట్లాడారు.
ప్రసవం పొందిన విధానం అడిగారు. భోజన వసతులపై ఆరా తీశారు. దవాఖాన ఆవరణలో మొక్కలు నాటాలని సిబ్బందిని ఆదేశించారు. పేషెంట్ల వెయిటింగ్ హాల్ పరిశీలించారు. పనులను త్వ రగా పూర్తిచేయాలని సూచించారు. ఆయన వెం ట సూపరింటెండెంట్ దేవేందర్‌రెడ్డి, వైద్యురాలు రజని, వైద్యాధికారులు పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, మే 9 : ప్రజా ఫిర్యాదుల విభాగంలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాల ని సంబంధిత అధికారులను నిర్మల్ కలెక్టర్ ము షారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబుతో కలిసి ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆయ న అర్జీలు స్వీకరించారు. మొత్తం 19 దరఖాస్తు లు రాగా, వాటిని సంబంధిత అధికారులకు అం దించి, తక్షణం పరిష్కరించాలని సూచించారు.
భూ సమస్యలు, పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. ఆర్డీవో లోకేశ్వర్‌రావు, కలెక్టర్ పరిపాలనా అధికారి కరీం, జిల్లా అధికారులు సత్తార్, శ్రీనివాస్‌రెడ్డి, అశోక్, రవీందర్‌రెడ్డి, సంతోష్, మల్లికార్జున్, అంజీప్రసాద్, రమేశ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, రామారావు, రాజేశ్వర్‌గౌడ్, తహసీల్దార్ శివప్రసాద్ పాల్గొన్నారు.