ఇచ్చోడ, మే 9 : తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైనా ఉన్నదని టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్లు పాటిమిది జగన్ మో హన్రావ్, దినేశ్ చౌదరి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఇచ్చోడలోని విఠల్‌రెడ్డి గార్డెన్స్‌లో సోమవారం టీఆర్ఎస్ సోషల్ మీడియా బోథ్ నియోజకవర్గ విస్తృత సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు ముఖ్య అతిథులుగా పాల్గొని, మాట్లాడారు. ప్రతిపక్షాల ఆరోపణలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని చీలుస్తూ, ప్రభుత్వ రంగ పథకాలను ప్రైవేటీకరిస్తూ కార్పొరేట్ రంగానికి కొమ్ముకాస్తున్నదని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ మహా వృక్షమని, సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.
ఈ సమావేశంలో డీసీసీబీ జిల్లా చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, డివిజన్ ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సహకార సంఘాల చైర్మన్లు, రైతు బంధు సమితి మండలాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.