ఆదిలాబాద్ టౌన్, మే 2 : సీఎం కేసీఆర్ అన్ని మతాలు, కులాలకు సమప్రాధాన్యం ఇస్తున్నారని తద్వారా సంస్కృతీ సంప్రదాయాలకు వన్నె వచ్చిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆయన సోమవారం ఆదిలాబాద్ మండలం భీంసరిలో విఠల్ రుకుంబాయి ఆల యం వద్ద రూ.5 లక్షలతో చేపట్టిన బుద్ధ విహార్ నిర్మాణానికి భూమి పూజచేశారు. బుద్ధ విహార్, విఠల్ రుకుంబాయి ఆలయ నిర్మాణానికి కూడా తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీపీ లక్ష్మీజగదీశ్, వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, ఎంపీటీసీ బిక్కి గంగాధర్, సర్పంచ్ మయూరి చంద్ర, టీఆర్ఎస్ నాయకుడు ఆరె నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎదులాపురం, మే 2 : జిల్లాలో అభివృద్ధి పను లు చేసిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగు తామని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పిట్టల వాడలో మథుర లబా నా సంఘ భవన నిర్మాణానికి జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్తో కలిసి భూమి పూజ నిర్వహించారు. ముందుగా హాజరైన వారికి పంగిడి ధరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయక త్వంలో సంఘాలు, కులాల ఆత్మ గౌరవానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. మథుర లబానా ఆచారాలు, సిద్ధ్దాంతాలను కాపా డేలా కృషి చేస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో చేపట్టిన బీసీ భవన్ పనులు పుర్తి కానున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ నిధులతో సంఘ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర సమస్యలు పరిష్కారానికి సీఎం కేసీఆర్ వద్దకు మథుర సం ఘాల నాయకులను తీసుకెళ్తానన్నారు.
అనంత రం జడ్పీ చైర్మన్ జనార్దన్ మాట్లాడుతూ తెలం గాణ సర్కారు కుల సంఘాలకు పెద్దపీట వేస్తున్న దని పేర్కొన్నారు. మాజీ ఎంపీ నగేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, సంఘం జిల్లా అధ్యక్షుడు చౌహాన్ కైలాస్, ప్రధాన కార్య దర్శి సత్య, సలహాదారులు మోహన్ సింగ్, సురా జ్ సింగ్, జాయింట్ కార్యదర్శి నాయక్ సింగ్, కోశాధికారి సిద్ధ్దుసింగ్, తదితరులు పాల్గొన్నారు.