
మంత్రి హరీశ్‌రావును కోరిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
కోయిలకొండ, జనవరి 14 : మండలకేంద్రంలోని సివిల్ దవాఖానను 50 పడకలకు అప్‌గ్రేడ్ చేసి, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో కలపాలని వైద్యారోగ్యశాఖ మం త్రి టీ.హరీశ్‌రావును ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి కోరారు. శుక్రవారం మంత్రిని ఎమ్మె ల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. కోయిలకొండలో రూ.6 కోట్లతో దవాఖాన నిర్మించామని, 18వ తేదీన ప్రారంభించాలని ఎమ్మెల్యే కోరారు. దవాఖానను అప్‌గ్రేడ్ చేసే లా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
బస్తీ దవఖాన నిర్మించాలి..
ఆత్మకూరు, జనవరి 14 : పట్టణంలో పట్టణంలో అన్ని వసతులతో ఆధునిక బస్తీ దవాఖానను నిర్మించాలని మంత్రి హరీశ్‌రావును టీఆర్ఎస్ నేత జగన్నాథ్‌రెడ్డి కోరారు. దవఖాన నిర్మాణానికి స్థలం కూడా అందుబాటులో ఉందని చెప్పారు. అలాగే మక్తల్ నియోజకవర్గకేంద్రంలో వీజేఆర్ ప్రజా ఫౌండేషన్, అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు కలిసి నిర్మించనున్న 50 పడకల దవాఖాన గురించి వివరించారు. నూతన దవాఖాన నిర్మాణానికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు జగన్నాథ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆటా సభ్యులు చైతన్యరెడ్డి, కౌశిక్‌రెడ్డి ఉన్నారు.