ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
39 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు
తలకొండపల్లి, జనవరి 29 : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని దేవకి గార్డెన్స్‌లో డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాస్ అధ్యక్షతన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 39 మందికి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణజన్ముడని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఏడున్నరేండ్లలో చేసి చూపించారని వివరించారు. వచ్చే రెండేండ్లలో కేఎల్ఐ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలతో కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ కోఆప్షన్ రహమాన్, సర్పంచ్‌లు లలిత, రమేశ్, చంద్రయ్య, ఈశ్వర్, మాజీ జడ్పీటీసీ నర్సింహ, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ రాజేందర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌రెడ్డి, రాంపూర్ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీశైలంయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇన్సూరెన్స్ చెక్కు అందజేత
తలకొండపల్లి మండలంలోని అంతారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కాలె నర్సింహ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవడంతో పార్టీ చేసిన ఇన్సూరెన్స్ ద్వారా రెండు లక్షల రూపాయలు మంజూరయ్యాయి. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పరామర్శించి మృతుడి భార్యకు చెక్కును అందజేశారు. అనంతరం వెల్జాల గ్రామంలో ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, యాదయ్య, బాలకిష్టయ్య, జంగయ్య, దస్తగిర్, కృష్ణ, నరేశ్, శ్రీను, చంద్రయ్య, బాలస్వామి, యాదగిరి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా
కడ్తాల్ : పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండల పరిధిలోని గోవిందాయిపల్లి తండా సంతోశ్నాయక్కి రూ.24 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. శనివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో లబ్ధిదారుడికి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకంతో నిరుపేదలకు కార్పొరేట్ దవాఖానలో అత్యుత్తమ వైద్యం అందుతున్నదని, ఈ పథకం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిదని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్‌యాదవ్ పాల్గొన్నారు.