
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా 50వేల మొక్కలు నాటుతాం : సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్‌చందర్
జడ్చర్ల, జనవరి 29 : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 2న జడ్చర్లలో నియోజకవర్గంలో మెగా గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్‌చందర్ తెలిపారు. నియోజకవర్గంలోని సర్పంచులతో కలిసి శనివారం జడ్చర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రణీల్‌చందర్ మాట్లాడారు. ఫిబ్రవరి 3న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా సర్పంచుల ఆధ్వర్యంలో 2వ తేదీన నియోజకవర్గంలోని 180 గ్రామపంచాయతీల్లో 250 చొప్పున 50వేల మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పుట్టినరోజున పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకురాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచన మేరకు గతేడాది నుంచి మెగా గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. గతేడాది 18వేల మొ క్కలు నాటగా, ఈ ఏడాది 50వేల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. జడ్చర్ల మండలంలోని మాచారంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే ఫిబ్రవరి 3న మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. రక్తదాతలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇందు కు సహకరించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు చెప్పారు. సమావేశంలో సర్పంచుల సం ఘం మండల అధ్యక్షుడు బాలసుందర్రెడ్డి, గౌరవాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి రామకృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి, నర్సింహులు, చేతనారెడ్డి, యాదయ్య, గంగాధర్‌గౌడ్, దీపక్ రాథోడ్, తిరుపతినాయక్, శంకర్ ఉన్నారు.