e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home జిల్లాలు రైతుల దశ మారింది

రైతుల దశ మారింది

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
దేశానికి అన్నం పెట్టే దిశగా తెలంగాణ రైతు
ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

కోస్గి, జూలై 28 : రైతుల దశదిశను మార్చిన ఘనత టీఆర్‌ఎస్‌ సర్కార్‌కే దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్‌, క్రీడా శాఖ మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎ త్తిపోతల పథకంతో కొడంగల్‌ నియోజకవర్గానికి సాగునీరందిస్తామన్నారు. బుధవారం ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి మండలంలో పర్యటించారు. ముందు గా పోలేపల్లి రైతువేదికను ప్రారంభించారు. స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ రైతువేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం హకీంపేట గ్రామంలో ఆరోగ్య కేంద్రాన్ని, బోగారం, గుండుమాల్‌ రైతు వేదికలను, అమ్లికుంట గ్రామంలో 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. కోస్గి మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రైతులంతా సంఘటితం కావాలని, అందరూ ఒక వద్దకు చేరుకొని సమస్యలపై చర్చించుకొని తమకు నివేదిస్తే తక్షణమే పరిష్కరించే అవకాశం ఉంటుందన్నా రు. ప్రతి రైతు ఏడాదికి రెండు సార్లు భూసార పరీక్షలు చేయించాలన్నారు. డిమాండ్‌ ఉన్న పంటలనే పండించాలని కోరారు. దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో రైతులు నేటికీ ఆయిల్‌ ఇంజన్లు వినియోగిస్తున్నారన్నా రు. కానీ తెలంగాణలో సుమారు 35 లక్షల మోటర్లకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. త్వరలో పా లమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ పనులు పూర్తిచేసి కొడంగల్‌కు సాగునీరందిస్తామన్నారు. ఇప్పటికే పనులు పూర్తి అయ్యేవని, అలా చేస్తే సీఎం కేసీఆర్‌కు మంచి పేరొస్తుందని మనమంటే గిట్టనోల్లు సుమారు 88 కేసులు వేశారన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ దేశానికే అన్నం పె ట్టేలా తెలంగాణ రైతు ఎదిగాడని, అది ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుణ్యమేనన్నారు. తెలంగాణ వచ్చాక రైతుల కండ్లల్లో సంతోషం కనుబడుతుందన్నారు. ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీరందుతుందన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు.

కోస్గి మార్కెట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దాలి..
కోస్గి మార్కెట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దాలని, ఇందుకు గానూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. స్థానిక ఏబీకే ఫంక్షన్‌హాల్‌లో మార్కెట్‌ కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. చైర్మన్‌గా వీరారెడ్డి, వైస్‌ చైర్మన్‌గా వరప్రసాద్‌, సభ్యులుగా రఘురాములు, బుక్క మోహన్‌, రామకృష్ణారెడ్డి, నాగవేణి, కిష్టాబాయి, దినేశ్‌కుమార్‌, విజయభాస్కర్‌రెడ్డి, మైమూ ద్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రు లు మాట్లాడుతూ మార్కెట్‌కు అవసరమైన వసతులు సమకూరుస్తామన్నారు.కోస్గి మార్కెట్‌కు రెండు గోదాం లు కావాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కోరగా, మంత్రి నిరంజన్‌రెడ్డి స్పందించారు. త్వరలో నూతన గోదాంల నిర్మాణాలకు డీపీఆర్‌ తయారవుతుందని, నియోజకవర్గానికి నాలుగు గోదాంలు మంజూరు చేస్తామన్నారు. కంది ప్రాసెసింగ్‌ సెంటర్‌ వచ్చేలా సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్స న్‌ వనజ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శిరీష, జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, ఎంపీపీ మధుకర్‌రావ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ భీంరెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఆత్మైస్థెర్యం దిశగా అడుగులు..
నారాయణపేట, జూలై 28 : వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా ఆత్మహత్యలకు కేరాఫ్‌గా ఉన్న చోట ఆత్మైస్థెర్యం దిశగా అడుగు లు పడుతున్నాయని మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ గార్డెన్‌లో బుధవారం గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ శాసం రామకృష్ణ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యేలు ఎస్‌.రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్‌ శ్రీధర్‌, ట్రేడ్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ మల్లప్ప, జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మా ట్లాడుతూ ఆంధ్రలో జగన్‌, చంద్రబాబు ఒకరిపై ఒకరు తిట్టుకున్నా.. అధికార పక్షంపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. ప్రాజెక్టుల విషయానికి వస్తే ఎవరూ కేసు లు వేసుకోరన్నారు.

కానీ మన రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్షాలు ఎప్పుడెప్పుడు కేసులు వేసి ప్రాజెక్టులను ఆపుదామా అని ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజలందరూ ఒక మాట మీద ఉంటే ప్రతిపక్షాలు సొంత ఎజెండాతో రాజకీయాలు చేస్తున్నాయన్నారు. సుదీర్ఘకాలంగా జెండా మోసిన వ్యక్తికి నేడు గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రూపంలో న్యాయం జరిగిందన్నారు. హైదరాబాద్‌ తర్వాత నారాయణపేటలో టెక్స్‌టైల్‌, బంగారం మార్కెట్‌లు ఏర్పాటవుతున్నాయన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి జిల్లాలోని జయమ్మ చెరువుకు నీటిని అందిస్తామన్నా రు. నారాయణపేట, మక్తల్‌లోనూ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి భవనంలాగా కింది భాగంలో సినియర్‌ సిటిజన్లకు, పై భాగంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana