బొంరాస్‌పేట, జనవరి 27: బొంరాస్‌పేట మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడు శేరి నారాయణరెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఇన్చార్జ్ ఎంపీడీవో పాండుకు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. రాజీనామా లేఖను నిబంధనల ప్రకారం జడ్పీ సీఈవోకు పంపిస్తామని ఎంపీడీవో పాండు తెలిపారు.
ఒప్పందంలో భాగంగానే..
నారాయణరెడ్డి రాజీనామా ఒప్పందంలో భాగంగానే జరిగింది. 2019లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మెజార్టీ స్థానా లు గెల్చుకున్న టీఆర్ఎస్ పార్టీలో వైస్ ఎంపీపీ, కోఆప్షన్ పదవులకు పోటీ ఏర్పడింది. వైస్ ఎంపీపీ కోసం చౌదర్పల్లి ఎంపీటీసీ నారాయణరెడ్డి, బురాన్‌పూర్ ఎంపీటీసీ సుదర్శన్‌రెడ్డి, బొంరాస్‌పేట ఎంపీటీసీ శ్రవణ్‌గౌడ్ పోటీపడితే అప్పుడు వైస్ ఎంపీపీ పదవిని రెండున్నరేళ్లకు నారాయణరెడ్డికి అప్పగించా రు. మిగిలిన రెండున్నరేళ్లలో సుదర్శన్‌రెడ్డి, శ్రవణ్గౌడ్లకు ఏడాది చొప్పున ఇవ్వాలని అప్పట్లో పార్టీ నాయకుల సమక్షం లో ఒప్పందం జరిగింది. ఆ మేరకు గురువారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కోఆప్షన్ కోసం కూడా షేక్ జలీ ల్, మహ్మద్ ఖాజా మైనుద్దీన్ పోటీ పడితే చెరో రెండేళ్లు పదవీ కాలాన్ని పంచుకునేలా ఒప్పందం చేసి జలీల్‌ను కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నుకున్నారు. అయితే జలీల్ రాజీనామాకు ఒప్పుకున్నా గురువారం రాజీనామా చేయలేదు. ఎంపీపీ హేమీబాయి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చాంద్‌పాషా, ఎంపీటీసీలు సమావేశమై వైస్ ఎంపీపీ రాజీనామా విషయాన్ని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి ఫోన్ లో వివరించారు. ఆయన ఆదేశాల మేరకు నూతన వైస్ ఎంపీపీగా బురాన్‌పూర్ ఎంపీటీసీ సుదర్శన్‌రెడ్డిని, కోఆప్షన్ సభ్యునిగా ఖాజా మైనుద్దీన్‌ను ఎన్నుకోవాలని నిర్ణయించారు. వైస్ ఎంపీపీ రాజీనామాను ఆమోదించిన తరువాత మండల ప్రత్యేక సమావేశం నిర్వహించి వైస్ ఎంపీపీ, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది.