కరోనా పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
పాజిటివ్ వచ్చిన వారికి ఐసొలేషన్ కిట్ అందజేత
కొవిడ్ నిబంధనలపై అవగాహన
యాచారం, జనవరి27 : మండలంలో జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మండలంలోని 24గ్రామాల్లో గురువారం 1386 ఇండ్లను సందర్శించి 1824మందికి జ్వర పరీక్షలు చేశారు. 26మందికి కొవిడ్ లక్షణాలు కనిపించడంతో వారికి ఐసొలేషన్ కిట్లను ఆశావర్కర్లు అందజేశారు. మండలంలో 70మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11మందికి పాజిటివ్ వచ్చినట్లు హెచ్ఈవో శ్రీనివాస్ తెలిపారు. మండలంలో ఇంకా 3024మంది సెంకడ్ డోస్ వ్యాక్సిన్ వేయించుకోని వాళ్లు ఉన్నారని, వారు వెంటనే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన కోరారు.
షాద్నగర్లో..
షాద్నగర్టౌన్, జనవరి 27 : కరోనా నియంత్రణ కోసం ఇంటింటి జ్వర సర్వే షాద్నగర్ మున్సిపాలిటీలో ముమ్మరంగా కొనసాగుతున్నది. గురువారం మున్సిపల్ రిసోర్స్ పర్సన్లు, హెల్త్ ఆశ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది సర్వే నిర్వహించి లక్షణాలు ఉన్నవారికి మందుల కిట్లను అందజేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు రాణి, యాదమ్మ, కిరణ్మయి, ఆశాలు, సిబ్బంది పాల్గొన్నారు.
మంచాలలో..
మంచాల, జనవరి 27 : కరోనా కట్టడిలో భాగంగా మంచాల మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో జ్వర సర్వే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. గురువారం ఏఎన్ఎమ్లు, ఆశవర్కర్లు, ఇంటింటా తిరుగుతూ సర్వే నిర్వహించారు. జలుబు, దగ్గు, జ్వరం, లక్షణాలున్నవారికి మందులు పంపిణీ చేస్తున్నారు.