రంగారెడ్డి జల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి రూ.2కోట్ల నిధులు
అదనంగా అనాజ్‌పూర్‌కు రూ.45లక్షలు మంజూరు
అబ్దుల్లాపూర్‌మెట్, జనవరి 27 : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ నుంచి మంజూరు చేసిన నిధులు ఏ విధంగా వినియోగిస్తున్నారనే విషయంలో అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిషత్ కార్యాలయాన్ని ఆమె గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దశలవారీగా చేపట్టిన పల్లెప్రగతిలో అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేశారన్నారు. జిల్లా పరిషత్ నుంచి రూ.2కోట్ల నిధులు మంజూరయ్యాయని.. అదనంగా అనాజ్‌పూర్‌లో స్త్రీశక్తి భవన నిర్మాణానికి రూ. 45లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలో ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నామన్నారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆమె చెప్పారు. జడ్పీటీసీ బింగి దాస్‌గౌడ్, కోఆప్షన్ ఎండీ అక్బర్‌అలీఖాన్ స్థానిక సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. వాటిని పరిష్కరించేందుకు జిల్లా పరిషత్ నుంచి నిధులు మంజూరు చేశామన్నారు. పేదలు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని అనితారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రేఖ, ఎంపీడీవో మమతాబాయి, ఎంపీవో వినోద, వైస్ ఎంపీపీ కొలన్ శ్రీధర్‌రెడ్డి, ఎంపీటీసీలు లావణ్య, వెంకటేశ్, బాలలింగస్వామి, సర్పంచ్‌లు రంగయ్య, మల్లేశ్, నాయకులు జంగమయ్యయాదవ్, నితిన్‌రెడ్డి పాల్గొన్నారు.