
మిడ్జిల్, జనవరి 28 : ప్రజా సంక్షేమ మే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వే స్తున్నదని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. శు క్రవారం మండలంలోని రాణిపేట మైస మ్మ ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసి న సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మా ట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సం క్షేమం, జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నా యకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చే రుతున్నారని తెలిపారు. విద్యారంగానికి రూ.7,200 కోట్లు కేటాయించారని తెలిపారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయన్నారు. అనంతరం మిడ్జిల్‌లో మాజీ సర్పంచ్ శివకుమార్‌రెడ్డి కటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియ ర్ నాయకుడు వెంకోబా, వెలుగొముల మాజీ సర్పంచ్ విజయాజీ, వార్డు సభ్యు లు అంజయ్యజీ, హనుమాన్జీ, టీడీపీ సీనియర్ నేత ఖాదర్‌తోపాటు మరో 50 మంది కార్యకర్తలు ఎమ్యెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎం పికైన ఎమ్యెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మాజీ జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమా ర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ సుదర్శన్, సర్పంచ్ నిరంజన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, నాయకులు సుధాబాల్రెడ్డి, బాలు, శ్రీనివాస్‌గుప్తా, జనార్దన్‌రెడ్డి, బాలయ్య, దా నియేలు, బుచ్చయ్య, నర్సింహారెడ్డి, నా రాయణరెడ్డి, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.