
ఆరోగ్యప్రదాత సీఎం కేసీఆర్
పేదల సంక్షేమానికి పెద్దపీట
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల, జనవరి 28 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. పట్టణంలోని చంద్రాగార్డెన్‌లో శుక్రవారం నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 57మందికి రూ.63లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 8మందికి రూ.40లక్షల విలువైన రైతుబీమా చెక్కులతోపాటు ఆరుగురికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధితో ప్రభుత్వం ఆపత్కాలంలో పేదలకు అండగా నిలుస్తున్నదన్నారు. ప్రజారోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమి స్తూ ఆరోగ్యప్రదాతగా మారారని కొనియాడారు. పేదల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తు న్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి సన్మానం
జడ్చర్ల/రాజాపూర్/బాలానగర్/భూత్పూర్, జనవరి 28 : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని శుక్రవారం నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మిరవీందర్, సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్‌చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామ్‌సుందర్‌రెడ్డి, మాజీ చైర్మన్లు కాట్రపల్లి లక్ష్మయ్య, మురళి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాలసుందర్రెడ్డి, సర్పంచులు రాజేశ్వర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, నర్సింహులు, ఆనంద్‌గౌడ్, రమేశ్‌నాయక్, కౌన్సిలర్లు, కోట్ల ప్రశాంత్‌రెడ్డి, లత, రామ్మోహన్, నర్సింహులు, కొండల్, దానిశ్ పాల్గొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని రాజాపూర్ మండల యూత్వింగ్ అధ్యక్షుడు వెంకటేశ్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు శ్రీశైలం, సర్పంచ్ బచ్చిరెడ్డి, నాయకులు మహిపాల్రెడి, మల్లేశ్‌గౌడ్, నారాయణరెడ్డి, చెన్నారెడ్డి, రాములు శివలింగం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బాలానగర్ మండల యూత్వింగ్ మండల అధ్యక్షుడు సుప్ప ప్రకాశ్, లక్ష్మణ్‌నాయక్, సింగిల్‌విండో డైరెక్టర్ గుడిసెల యాదయ్య, జగన్నాయక్, లక్ష్మణ్‌నాయక్, బాలయ్య సన్మానించారు. అలాగే ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, మనెమోని సత్యనారాయణ పాల్గొన్నారు.