
భారీగా బయలుదేరుతున్న లారీల దండు
డస్ట్‌తో ప్రమాదాలకు గురవుతున్న స్థానికులు
గతంలో 10మంది మృతి, అనేక మందికి గాయాలు
నిబంధనల మేరకు లారీలను అడ్డుకున్న పోలీసులు
బీజేపీ నేతలు ధర్నాకు దిగి దౌర్జన్యం
మహబూబ్‌నగర్ జనవరి 28, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కర్ణాటకలోని శక్తినగర్ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి బూడిద లోడ్‌తో వందల సంఖ్యలో లారీలు నిత్యం వెళ్తుండడంతో నారాయణపేట జిల్లా కృష్ణ, మాగనూరు, మక్తల్ మండలాల ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. డ్రై డస్ట్, వెట్డస్ట్ను తరలించే లారీలపై కనీసం టార్పాలిన్లు నిండుగా కప్పడంలేదు. దీంతో ద్విచక్రవాహనదారుల కండ్లలో డస్ట్ పడి ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం వందలాది లారీలు ఓవర్‌లోడ్, ఓవర్ స్పీడ్‌తో వెళ్తుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రాయిచూర్- హైదరాబాద్, రాయిచూర్- గుల్బర్గా రహదారిపై ఇష్టం వచ్చినట్లు లారీలను పార్కింగ్ చేయడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నది. చాలా లారీలకు పోలీసులు చలానాలు విధించినా కట్టకుండా ఇష్టానుసారంగా వెళ్తున్నారు. డస్ట్ లారీలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, వీటిని నియంత్రించాలని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ తరుణం లో శుక్రవారం కర్ణాటక నుంచి తెలంగాణలోకి ప్రవేశించే ప్రదేశమైన కృష్ణా మం డలం టైరోడ్ వద్ద పోలీసులు లారీలను ఆపి పెండింగ్ చలానాలు కట్టాలని కోరారు. అయితే స్థానికంగా కొం దరు బీజేపీ నేతలు శుక్రవారం కృష్ణా మండలం టైరో డ్ వద్దకు వచ్చి పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా.. సీజ్ చేసిన లారీలను సైతం అక్కడి నుంచి పంపించేశారు. స్థానికంగా ఈ లారీలవల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడం, స్థానికులు గాయపడటం వంటి సమస్యలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా కర్ణాటకకు చెందిన లారీల యజమానుల కోసం బీజేపీ నేతలు వచ్చి ధర్నా చేయడం చర్చనీయాంశంగా మారింది.
లారీ డ్రైవర్లతో కలిసి బీజేపీ నాయకులు ధర్నా చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. లారీల వాళ్లను రోడ్డుపై ధర్నాకు కూర్చోబెట్టి కొందరు బీజేపీ నాయకులు కావాలని సమస్యలు సృష్టించారని పోలీసులు తెలిపారు. తమ విధులకు ఆటంకం కలిగించారని, వారు చేసిన ఆగడాలన్నింటి ని రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్, ఓవర్ స్పీడ్‌తో వెళ్లే వాహనాలవల్ల స్థానికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి నా బీజేపీ నాయకులు ధర్నాకు దిగి ఇబ్బందులు పెట్టారని కృష్ణ ఎస్సై నాగరాజు చెప్పారు. విధులకు ఆటం కం కలిగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నా రు. కాగా, ఏడాదిన్నర కిందట ఓ డస్ట్ లారీ అతివేగం గా వచ్చి కారును ఢీకొన్న ఘటన లో ఒకే కుటుంబానికి చెందిన 8మంది చనిపోయారు. మరో రెండు ప్ర మాదాల్లో ఇద్దరు స్థానికులు చనిపోయారు. వందలాదిమంది గాయపడ్డారు. అనేకమంది కండ్లల్లో డస్ట్ పడి ప్రమాదాల బారిన పడ్డారు. ఇంతటి సమస్యలకు కారణమైన డస్ట్ లారీలను నిబంధనల మేరకు అడ్డుకున్న పోలీసులపై బీజేపీ నేతలు దౌర్జన్యం చేయడంపై స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ధర్నా చేయమని తమకు అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చాయని స్థానిక బీజేపీ నేతలు చెప్పుకోవడంపై సమీప గ్రామాల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నా రు. ప్రజలకు మేలు చేసే పనికోసం ధర్నా చేస్తే ఓ సింగారమని.. లారీల ఓనర్ల కోసం బీజేపీ నేతలు ధ ర్నాకు దిగడం సిగ్గుచేటని చర్చించుకుంటున్నారు.