
కోస్గి, జనవరి 28 : టీపీసీసీ అ ధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొడంగల్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని అడిగిన సవాల్‌ను మా నాయకుడు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి స్వీ కరించారని జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాజే శ్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం వారు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి పిలుపుమేరకు కొడంగల్ అభివృద్ధిపై చర్చకు మేము సి ద్ధమని, అభివృద్ధి నీవు చేస్తే చర్చకు రావాలన్నా రు. అనవసరంగా కొంతమంది అల్లరిమూకలతో రాస్తారోకో, ధర్నా చేయిస్తే అబద్దాలు నిజం కావన్నారు. గతంలో ఇలాగే ఒకసారి వచ్చి చిల్లరగా మాట్లాడి వెళ్తే మేము సవాల్ విసిరామని, పోయి మళ్లీ వచ్చి సవాల్ చేసి పారిపోతే ఎలాగన్నారు. కొడంగల్ ప్రజలకు నిజానిజాలు తెలియాల్సిన అ వసరం ఉందన్నారు.
రెచ్చగొట్టే మాటలు మానుకోవాలి
మద్దూర్, జనవరి 28 : రేవంత్‌రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని, చేసింది త క్కువ చెప్పేది ఎక్కువని కోస్గి మార్కెట్ కమిటీ చై ర్మన్ వీరారెడ్డి అన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి కోస్గిలో బస్‌డిపో తేలేదని పేర్కొన్నా రు. శాటిలైట్ డిపో పేరుతో ఆర్టీసీలో ఒకరోజులో రిటైర్డ్ అవుతున్న అధికారి సత్యనారాయణతో ప్రా రంభించి వదిలేశారన్నారు. ప్రజలను మోసం చే యరాదని, మా నాయకుడు నరేందర్‌రెడ్డి సంబంధిత మంత్రులతో మాట్లాడి డిపో మంజూరు చే యించి పనులు పూర్తి చేశారన్నారు. త్వరలో ప్రా రంభానికి సిద్ధ్దంగా ఉందన్నారు. నీవు కొడంగల్ ను అభివృద్ధి చేస్తే మా నాయకుడు విసిరిన సవాల్‌ను స్వీకరించి చర్చకు రావాలన్నారు. లేదంటే మాటతీరు మార్చుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వీరేశ్‌గౌడ్, గోపాల్, బత్తిరెడ్డి, రాము లు, రాజు, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.