
ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు మొగ్గు చూపాలి
మరుగుదొడ్లు వందశాతం పూర్తి చేయాలి
ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి
వివిధ అంశాలపై సమావేశం
నారాయణపేట టౌన్, జనవరి 28 : రైతులు ఆరుతడి, వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కలెక్టర్ హరిచందన ఆధ్వర్యంలో పేట జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని శుక్రవారం వెబ్ ఎక్స్ ద్వారా నిర్వహించారు. వ్యవసాయ, వైద్యం, గ్రామీణ అభివృద్ధి, విద్యుత్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, విద్య, పౌర సరఫరాలు, ముఖ్య ప్రణాళిక, ఉద్యానవనం, జిల్లా పరిషత్, అటవీ శాఖలపై సమీక్షించారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల అభ్యున్నతికి అమలు చేస్తున్న పథకాల తీరు తెన్నులను కమిటీలో సమీక్షించారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు, మార్కెటింగ్‌కు అవకాశాలు పుష్కలంగా ఉన్నందున రైతులను ప్రోత్సహించాలన్నారు.
పని కోరిన ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించాలని, వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు వం దశాతం పూర్తి చేయాలన్నారు. మహిళా సంఘాల సభ్యుల కు నైపుణ్య శిక్షణ అందించి తమ వ్యాపారాల్లో ఆదాయాన్ని పెంచుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నివాస గృహా లు కల్పించాలని, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద జిల్లాకు మంజూరైన యూనిట్లను గ్రౌండింగ్ చేసి లబ్ధిదారులకు అందిచాలన్నారు.
మద్దూర్ ఎంపీపీ విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు తమ వ్యవసాయ భూమి ఇచ్చిన రై తులు తమకు అందులో ఉద్యోగం ఇవ్వలేదని ప్రారంభోత్సవానికి అడ్డుతగులుతున్నారని, వారికి న్యాయం చేయాలని కమిటీ దృష్టికి తీసుకొచ్చారు.
కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ సమీక్షలో ప్రస్తావన కు వచ్చిన అంశాలను చిత్తశుద్ధితో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు ఉపాధి క ల్పించే విషయంలో పూర్తి వివరాలు తనకు నివేదిక పంపించాలని, విద్యుత్ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా చూస్తానన్నారు.
ఇంటింటి జ్వర సర్వే వందశాతం పూర్తి చేసి లక్షణాలు ఉన్న వారికి మెడికల్ కిట్లు అందజేశామన్నారు. సమావేశం లో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, పద్మజారాణి, డీఆర్డీవో గోపాల్నాయక్తోపాటు ఆయా శాఖల అధికారులు, ము న్సిపల్ కమిషనర్లు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.