
నారాయణపేట, జనవరి 28 : కర్ణాటక నుంచి బూడిద లోడ్‌తో వస్తున్న లారీలను నిలిపి పేట ఎమ్మెల్యే రాజేం దర్‌రెడ్డి డబ్బులు డిమాండ్ చేశారంటూ ఓ ప్రైవేట్ న్యూస్ యాప్‌లో తప్పుడు వీడియో అప్లోడ్ చేసిన వ్యవహారంపై స్థానిక టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. త ప్పుడు వార్తను ప్రసారం చేసినందుకు సదరు న్యూస్ యా ప్పై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీ డియాలో ఎవరో ఏదో పోస్ట్ చేస్తే కనీసం అందులో నిజానిజాలు ఏమిటో కూడా విచారణ చేయకుండా, ఎమ్మెల్యేకు ఏ మాత్రం సంబంధం లేని వ్యవహారంలో ఆయన పై తప్పుడు వార్త ఇవ్వడమే కాకుండా ఆయన పరువుకు భంగం కలిగించారని టీఆర్ఎస్ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు కథనాలు సర్క్యులేట్ చే యొవద్దని హెచ్చరించారు.
చర్యలు తీసుకోవాలి
నారాయణపేట టౌన్, జనవరి 28 : పేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డిపై ప్రైవేట్ న్యూస్ యాప్‌లో తప్పుడు వార్తను ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఆర్ఎస్ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు, 15వ వార్డు కౌన్సిలర్ రాజేశ్వరి అన్నారు. అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న ఎమ్మెల్యేపై ఇలాంటి వీడియోలు చేయడం సరికాదన్నారు. న్యూస్ యాప్‌లో వీడియో అప్లోడ్ చేసిన వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
కొంతమంది వ్యక్తులపై
నారాయణపేట రూరల్, జనవరి 28 : పేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డిపై కొంత మంది వ్యక్తులు అనుచిత వీడియోలు తయారు చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు వేపూరి రాములు కోరారు. పేట పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఆయన ఎస్సై సురేశ్‌కు ఫిర్యాదు చేశా రు. కార్యక్రమంలో నాయకులు కోట్ల జగన్మోహన్రెడ్డి, ర వీందర్‌గౌడ్, వడేప్ప, శ్రీనివాస్‌రెడ్డి, రాజు, రామ్మోహన్, అలీ షేర్, మోహన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.