
అందజేసిన కలెక్టర్ పమేలా సత్పతి
భువనగిరి అర్బన్, డిసెంబర్ 27: జిల్లాలో బాధ్యతలు చేపట్టిన ఉద్యోగులు వారికి కేటాయించిన ప్రదేశాల్లో వెంటనే విధుల్లో చేరాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. భువనగిరి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉద్యోగుల అలాట్మెంట్ ప్రక్రియ కౌన్సెలింగ్ ద్వారా సోమవారం నిర్వహించి ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 29శాఖలకు సంబంధించి 201మంది ఉద్యోగులు ఉత్తర్వులు పొందారన్నారు. మరిన్ని శాఖలకు నేడు కౌన్సిలింగ్ నిర్వహించి వారికి కేటాయించిన విధుల్లో చేరేలా అలాట్మెంట్ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి మొర నాగేశ్వరాచారి, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సి.జగన్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి, కార్యదర్శి పొదిల రవికుమార్, జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.