12 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి
రైతుల ఖాతాల్లో రూ. 334. 96 కోట్లు జమ
పెద్దపల్లి జంక్షన్, మే 26: జిల్లాలో యాసంగి కొనుగోళ్లు లక్ష్యం దిశగా సాగుతున్నాయి. కరోనా వైరస్ ఉధృతి ఉన్నా.. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించడంలో ఇబ్బందులు ఎదుర్కొకూడదనే రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక ధాన్యాన్ని ప్రకారం సేకరిస్తున్నది.
ఇప్పటి దాకా..
జిల్లాలో 298 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లక్ష్యం కాగా, 292 ప్రారంభించారు. ఇప్పటి దాకా 12 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయింది. ముందుస్తుగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావడంతో ఆయా కేంద్రాల పరిధిలో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకాలు చేశారు. అలాగే వచ్చే నెల మొదట వారంలో 50 శాతం, రెండో వా రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగియనున్నట్లు తెలుస్తోంది. ఐకేపీ -55, డీసీఎంఎస్ -14, పీఏసీఎస్ -206, మార్కెటింగ్ -5 కేం ద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి.
36,249 రైతుల నుంచి..
292 కొనుగోలు కేంద్రాల ద్వారా 36, 249 మంది రైతుల నుంచి 2, 88, 835. 390 మెట్రి క్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వీటి విలువ రూ. 538. 56 కోట్లు. ఇందులో 28, 908 రైతులకు సంబంధించి 2, 18, 749. 440 మెట్రిక్ టన్నుల (76శాతం)ధాన్యాన్ని ఆన్లైన్ చేశారు. వీటి విలువ రూ. 412. 64 కోట్లు ,కాగా 1, 77, 556. 760 మెట్రిక్ టన్నులకు సంబంధించిన 22,959 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 334. 96 కోట్లను (81శాతం) జమచేశారు. ఇందులో ఐకేపీ కొనుగోలు కేంద్రాల నుంచి రూ. 70. 06 కోట్లు, డీసీఎంఎస్ నుంచి రూ. 12. 66 కోట్లు, పీఏసీఎస్ ద్వారా రూ. 244. 93 కోట్లు, మార్కెటింగ్ నుంచి రూ. 7. 31 కోట్లు చెల్లించారు.
ధాన్యం సేకరణ ఇలా..
జిల్లాలో ఐకేపీ, డీసీఎంఎస్, పీఏసీఎస్, మా ర్కెటింగ్శాఖ ద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటి దాకా ఐకేపీ -58 కేంద్రాల ద్వారా 7678 మంది రైతుల నుంచి 58,002 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ 14 కేంద్రాల ద్వారా 1111 మంది రైతుల నుంచి 11,479 మెట్రిక్ టన్నులు, పీఎస్సీఎస్- 221 కేంద్రాల ద్వారా 26, 141 మంది రైతుల నుంచి 2,10, 764 మెట్రిక్ టన్నులు, మార్కెటింగ్ 5 కొనుగోలు కేంద్రాల ద్వారా 1319 మంది రైతుల నుంచి 8,588 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు.