శనివారం ఉదయం నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవులు
మేడ్చల్, డిసెంబర్ 25: క్రిస్మస్ సందర్భంగా నియోజకవర్గంలో క్రైస్తవులు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చర్చీల్లో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, కేక్ కట్ చేశారు. పలు చర్చీల్లో అన్నదానం, బట్టలు, బియ్యం పంపిణీ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
మేడ్చల్ మున్సిపాలిటీలో…
మున్సిపాలిటీ పరిధి… 4వ వార్డు కిష్టాపూర్‌లోని నిస్సి మిరాకిల్ చర్చిలో మున్సిపల్ చైర్ పర్సన్ దీపికా నర్సింహా రెడ్డి, కౌన్సిలర్ గణేశ్ ప్రభుత్వ క్రిస్మస్ కానుకలను కైస్తవ సోదరులకు అందజేశారు. 3వ వార్డు అత్వెల్లి గ్రామంలో కౌన్సిలర్ జాకట దేవరాజ్ క్రైస్తవ సోదరులకు దుస్తులను పంపిణీ చేశారు. రాఘవేంద్రనగర్‌లోని కింగ్స్ టెంపుల్ చర్చిలో వైస్ చైర్మన్ రమేశ్, కౌన్సిలర్ నాగరాజు, మణికంఠ పాల్గొన్నారు.
దమ్మాయిగూడ, నాగారంలో..
మేడ్చల్ కలెక్టరేట్ : దమ్మాయిగూడలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో కేక్‌కట్ చేసి సంబురాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు చంద్రారెడ్డి, ప్రణీత గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.
శామీర్‌పేట మండలంలో..
శామీర్‌పేట : ఉమ్మడి శామీర్‌పేట మండలంలోని చర్చిల్లో క్రైస్తవ సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. తూంకుంట మున్సిపాలిటీలోని 9వ వార్డులో చైర్మన్ క్రైస్తవ సోదరులకు అన్నదానం చేపట్టగా, తుర్కపల్లిలోని సేవ్ఆల్-రీచ్ఆల్ సొసైటీ అనాథాశ్రమంలో చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు.
ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల్లో..
ఘట్కేసర్ : ఘట్కేసర్లోని గాస్పాల్ లోకల్ చర్చి, క్యాథలిక్ చర్చి, పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని మేరీమాత చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ 7వార్డులో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. నాయకులు ఎం.జంగయ్య యాదవ్, నర్సింగ్‌రావు, విజయ్, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.
కీసర : కీసరలోని ది పెంతొకోస్త్ చర్చికి నగరంలోని పలు ప్రాంతాల నుంచి క్రైస్తవ సోదరులు విచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తుడుం శ్రీహరి పుట్టిన రోజు సందర్భంగా కీసరలోని చర్చికి 50కిలోల బియ్యాన్ని అందజేశారు.
ఘట్కేసర్ రూరల్ : అవుషాపూర్‌లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పలు గ్రామాల సర్పంచులు వెంకటేశ్ గౌడ్, రమాదేవి, గోపాల్ రెడి,్డ కావేరి మచ్చేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గీతా శ్రీనివాస్ పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ బాసరగేడిలోని ఓలివా ప్రార్థన మందిరంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.కౌన్సిలర్లు రాజకుమారి సుధాకర్, ఆంథోనమ్మఫిలిప్స్, కో ఆప్షన్ సభ్యుడు చిన్నపరెడ్డి పాల్గొన్నారు.
జవహర్‌నగర్ : కార్పొరేషన్‌లోని 8వ డివిజన్, చెన్నాపురం చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో డిప్యూటీ మేయర్ శ్రీనివాస్‌గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్పొరేటర్ రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ సాధిక్ సాధిక్, పాస్టర్లు పాల్గొన్నారు.