
దేశ అభివృద్ధికి దోహదపడాలి
మంచి నాయకుడిని ఎన్నుకోవాలి
ఇన్చార్జి ఆర్డీవో నర్సింగరావు
ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం
జిల్లాలో 1,915 మంది కొత్త ఓటర్లు
కొత్త ఓటర్లు, యువకులు,ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ
నారాయణపేట టౌన్, జనవరి 25 : ఎన్నికల్లో ఓటు హ క్కు వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకొని దేశ అభివృద్ధికి దోహదపడాలని ఇన్చార్జి ఆర్డీవో నర్సింగరావు అన్నారు. మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవం సం దర్భంగా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రభుత్వ పాఠశాల వరకు నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం కన్నా ఒకరోజు ముందు జనవరి 25న ఓటరు దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. 18 ఏండ్లు పూర్తయిన యువత తమ పే రును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు. ఓ టు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రతిఒక్క రూ ఓటును నిర్భయంగా వినియోగించుకోవాలన్నారు. జి ల్లాలో 1,915 మంది ఓటర్లుగా నమోదు చేసుకోవడం జరిగిందని చెప్పారు. ఓటు హక్కును వినియోగించుకుంటున్న సీనియర్ సిటిజన్లను సన్మానించారు. కొత్త ఓటర్లు, యువ కులు, ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కొత్త ఓటరుగా నమోదు చేసుకున్న యువతకు ఓటరు గు ర్తింపు కార్డును అందజేసి, ఓటు ప్రాముఖ్యత అంశంపై జి ల్లాస్థాయిలో నిర్వహించిన వ్యాసరచ న, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సీఈవో సిద్ధిరామప్ప, డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, తాసిల్దార్ దాన య్య, సర్వేయర్ మల్లేశ్, ఓటర్లు, యు వకులు తదితరులు పాల్గొన్నారు.
ఓటు వజ్రాయుధం
కోస్గి, జనవరి 25 : ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటు హక్కు పై మండలంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ముశ్రీఫా, బోగారం గ్రామాల్లో బీఎల్వోలు ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కు రాజ్యాంగం క ల్పించిన ఆయుధమని, మన పాలకులను మనం ఎన్నుకోవచ్చన్నారు. కార్యక్రమంలో నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం
కృష్ణ, జనవరి 25 : మండలకేంద్రంతోపాటు పలు పాఠశాలలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మంగళవా రం ఘనంగా జరుపుకొన్నారు. మండలకేంద్రంలో తాసిల్దా ర్ సురేశ్‌కుమార్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయుడు నిజామోద్దీన్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ప్ర తిజ్ఞ చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమని చెపారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కా ర్యక్రమంలో బీఎల్వోలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఓటు హక్కుపై అవగాహన
మద్దూర్, జనవరి 25 : ఓటరు దినోత్సవం సందర్భంగా ఓటు హక్కుపై మండలకేంద్రంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా తాసిల్దార్ రామ్‌కోటి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ఆయుధమన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దర్ నాగేంద్రప్ర సాద్, మండల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు
విద్యార్థినికి ద్వితీయ బహుమతి
ఊట్కూర్, జనవరి 25 : జాతీయ ఓటరు నమోదు దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో చిన్నపొర్ల జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని పాల్గొని ద్వితీయ బహుమతి సాధించింది. మంగళవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన వ్యాసరచనలో పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని శిరీష ఉత్తమ ప్రతిభ కనబర్చి ద్వితీయ బహుమతి సాధించినట్లు సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు నర్సింహ తెలిపారు.
ఈమేరకు జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ ఏవో నర్సింగ్‌రావు విద్యార్థినికి బహుమతి అందజేస్తూ అభినందించారు.