కలెక్టర్‌కు సమస్య వివరించిన ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి
27న రైతులతో ప్రత్యేక సమావేశం
యాచారం, డిసెంబర్22: మండలంలోని మల్కీజ్‌గూడ గ్రామంలో నెలకొన్న భూసమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం నూతన ఆర్డీవో కార్యాలయ నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ అమయ్‌కుమార్ దృష్టికి మల్కీజ్‌గూడ భూసమస్యలను ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తీసుకెళ్లారు. రైతుల సమస్యలను కలెక్టర్, ఆర్డీవో వెంకటాచారితో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి చర్చించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని నందివనపర్తి రెవెన్యూ గ్రామం నుంచి మల్కీజ్‌గూడ ప్రత్యేక రెవెన్యూను గ్రామంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు గ్రామ రెవెన్యూ సమస్య అలాగే ఉందన్నారు. అప్పటి అధికారుల తప్పుడు చర్యల వల్ల రెండు గ్రామాల రికార్డులు తారుమారయ్యాయన్నారు. నందివనపర్తి, మల్కీజ్‌గూడ గ్రామాలకు చెందిన 162 సర్వే నెంబర్ వరకు ఆన్లైన్ నమోదులో ఇబ్బందులు తలెత్తి కొత్త పాసు పుస్తకాలు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 27న రైతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆర్డీవో వెంకటాచారి, తాసిల్దార్ నాగయ్యను కలెక్టర్ అమయ్‌కుమార్ ఆదేశించినట్లు ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, మల్కీజ్‌గూడ ఎంపీటీపీ డేరంగుల శారద, నాయకులు శంకర్, అబ్బయ్య, యాదయ్య పాల్గొన్నారు.