
కశిరెడ్డి, కూచుకుళ్లకు మరోసారి అవకాశం
స్థానిక సంస్థల టీఆర్ఎస్ అభ్యర్థులుగా నేడు నామినేషన్ల దాఖలు
బీ ఫారాలు అందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మెజార్టీ ఓటర్లు టీఆర్ఎస్కు చెందిన వారే..
అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకే..
మహబూబ్‌నగర్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తిరిగి కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డికి అవకాశం లభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వీరిరువురికీ పార్టీ బీ ఫారాలు అందజేశారు. ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి నేటితో తెరపడనుండడంతో వీరు దాఖలు చేయనున్నారు. ఈమేరకు టీఆర్ఎస్ శ్రేణులుపెద్ద ఎత్తున తరలిరానున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎ మ్మెల్సీ అభ్యర్థులుగా తిరిగి కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డికి అవకాశం లభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వీరిరువురికీ పార్టీ తరఫున బీ ఫారాలు అందజేశారు. ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వెంకట్రావు సమక్షంలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 2015 డిసెంబర్ 31 న స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డిలను తిరిగి పార్టీ అభ్యర్థులుగా ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఉ మ్మడి జిల్లాలో అత్యధిక స్థానిక సంస్థల ఓటర్లు అధికా ర పార్టీకి చెందిన వారే కావడంతో వీరి గెలుపు నల్లేరు మీద నడక అని చెప్పవచ్చు. సోమవారం చివరి క్షణంలో గట్టు మండలానికి చెందిన కృష్ణ అనే ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేసే కార్యక్రమానికి టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రానున్నాయి. గతంలో ఎమ్మెల్సీలుగా పనిచేసిన వారికే తిరిగి అవకాశం కల్పించడం పట్ల పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమకు మరోసారి ఎమ్మెల్సీలుగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లాకు చెందిన మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్ రెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు.