
కొత్తకోట, నవంబర్ 21 : మండలంలోని కనిమెట్ట గ్రామంలో ఆదివారం అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులను ఎంపీపీ గుంతమౌనిక సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేప పిల్లలను అందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. మత్స్య సంపద వృద్ధి చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, వారి పిల్లలను కూడా బాగా చదువించుకోవాలన్నారు. అనంతరం కేక్‌కట్ చేశారు. అలాగే పట్టణంలోని మత్స్యకారు లు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మత్స్యకారుల మండల అధ్యక్షుడు రంగస్వామి, మాజీ వై స్ ఎంపీపీ గుంతమల్లేశ్, వాకిటి బాలరాజు, నాయకులు పరశురాములు, కోటేశ్వర్‌రెడ్డి, గాధం పరమేశ్, సురేశ్‌యాదవ్, వెంకటన్న, రాఘవేందర్, కావలి రమేశ్, శ్రీను, రమేశ్, అంజి, మన్యంకొండ తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారులకు అవగాహన
వనపర్తిరూరల్, నవంబర్ 21 : మత్స్యకారుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని జిల్లా మత్స్యశాఖాధికారి రెహమాన్ అన్నారు. ఆదివారం జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో ప్రపంచ మత్స్యదినోత్సవాన్ని పురస్కరించుకొని మత్స్యకారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మత్స్యకారులు తమ సంఘాల అభివృద్ధికి పాటుపడాలని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది మహేశ్, కిరణ్, కృష్ణయ్య, వివిధ గ్రామాల మత్స్యకారులు బాలరాజు, చెన్నరాములు, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.