
ఢిల్లీలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రదానం
అవార్డులు అందుకున్న సిద్దిపేట, హుస్నాబాద్ చైర్పర్సన్లు, కమిషనర్లు
ప్రజలు, అధికారులు, పాలకవర్గాలకు మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు
సిద్దిపేట/హుస్నాబాద్ టౌన్, నవంబర్ 20 : స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను సిద్దిపేట, హుస్నాబాద్ మున్సిపాలిటీల చైర్పర్సన్లు, కమిషనర్లు అందుకున్నారు. స్వచ్ఛ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో స్వచ్ఛ సిటీ అవార్డును కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మం జులారాజనర్సు, కమిషనర్ రమణచారి అందుకున్నారు. అలాగే, ఫాస్టెస్ట్ మూవర్ సిటీ సౌత్‌జోన్ విభాగంలో మొద టి ర్యాంకు అవార్డును అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న, మున్సిపల్ కమిషనర్ ఎస్. రాజమల్లయ్యకు అం దజేశారు. అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్న సిద్దిపేట, హుస్నాబాద్ చైర్పర్సన్లు, కమిషనర్లు ఆనం దం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట మున్సిపాలిటీ ఇప్పటివరకు 17 అవార్డులను సాధించిందని, ఇదే స్ఫూర్తితో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలువాలన్నారు. ప్రజల భాగస్వామ్యం, ఐక్యత, అంకితభావం, ప్రజాప్రతినిధుల చొరవతో అవార్డు వచ్చిందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.
దుబ్బాక, తూప్రాన్, నర్సాపూర్‌కు ర్యాంకులు
స్వచ్ఛ సర్వేక్షణ్-2021గానూ భాగంగా రాష్ట్రస్థాయిలో దుబ్బాక, తూప్రాన్ మున్సిపాలిటీలకు 10వ ర్యాంకు లు వచ్చాయని దుబ్బా కమిషనర్ గణేశ్‌రెడ్డి, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్‌గౌడ్, కమిషనర్ మోహన్ తెలిపారు. జోనల్ స్థాయిలో దుబ్బాకకు 62వ ర్యాంకు వచ్చిందన్నారు. దేశంలోని నాలుగు వేలకు పైగా ము న్సిపాలిటీల్లో శానిటేషన్‌కు సంబంధించి వివిధ అంశాలపై నిర్వహించిన పోటీల్లో ఆయా మున్సిపాలిటీలు మెరుగైన ర్యాంకులు సాధించాయని చెప్పారు. సౌత్ జోన్లో 25 వేల జనాభా కేటగిరీలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ అయినప్పటికీ దుబ్బాక 62వ ర్యాంకు సాధించిందన్నారు. సౌత్జోన్లో పోటీపడి జోనల్ లెవల్లో 11వ ర్యాంకు తూప్రాన్ మున్సిపాలిటీ దక్కించుకుందన్నారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల సేవలను వారు అభినందించారు. రాబోయే రోజుల్లో ప్రజల సహకారంతో మరింత మంచి ర్యాంకు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే, నర్సాపూర్ మున్సిపాలిటీకి 51వ ర్యాంక్ వచ్చిందని మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి తెలిపారు. మెదక్ మున్సిపాలిటీ 27వ ర్యాంక్ సాధించిందని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి పేర్కొన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ 40వ స్థానంలో నిలిచిందని, మెరుగైన ర్యాంక్ వచ్చేందుకు సహాయపడిన కౌన్సిల్ సభ్యులందరికీ మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, కమిషనర్ చం ద్రశేఖర్ మున్సిపల్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. ఆయా బల్దియాలకు ర్యాంకులు రావడంపై చైర్మన్లు, చైర్పర్సన్లు, కమిషనర్లు సంతోషం వ్యక్తం చేశారు.