
మద్యం దుకాణాల కేటాయింపు
ఉమ్మడి జిల్లాలో 230 షాపులు
223 దుకాణాలకు లక్కీడిప్
కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో పారదర్శకంగా ఎంపిక
దరఖాస్తులు తక్కువగా వచ్చిన 7 షాపులు నిలిపివేత
పుల్లూరులోని 29వ వైన్స్‌కు అత్యధికంగా 98 దరఖాస్తులు
వనపర్తి (నమస్తే తెలంగాణ)/మహబూబ్‌నగర్/గద్వాల/నాగర్‌కర్నూల్, నవంబర్ 20 ;మద్యం దుకాణాల కేటాయింపుతో ఉత్కంఠ వీడింది. ఉమ్మడి జిల్లాలోని 230 దుకాణాలకు శనివారం లక్కీడిప్ నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా కొనసాగింది. కాగా 7 దుకాణాలకు టెండర్లు తక్కువగా రావడంతో తర్వాత నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఎంపికలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు కలిపి 90 దుకాణాలకు 1530 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా కోయికొండ నుంచి 39 దరఖాస్తులు అందాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో 67 దుకాణాలకు 1507 దరఖాస్తులు రాగా.. కల్వకుర్తి సర్కిల్ పరిధిలోని 39వ షాపునకు 51, వనపర్తి జిల్లాలోని 37 దుకాణాలకు 694 దరఖాస్తులు రాగా పెద్దమందడి దుకాణానికి 34, జోగుళాంబ గద్వాల జిల్లాలోని 36 దుకాణాలకు 987 దరఖాస్తులు అందగా ఉండవెల్లి మండలం పుల్లూరులోని 29వ షాపునకు 98 దరఖాస్తులు వచ్చాయి.
క్షణక్షణం.. ఉత్కంఠ వాతావరణంలో మద్యం దుకాణాలకు అధికారులు లక్కీడిప్ నిర్వహించారు. శనివారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని వైట్ కన్వెన్షన్హాల్లో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లా పరిధిలోని 90 మద్యం దుకాణాలను కలెక్టర్ ఎస్.వెంకట్రావు సమక్షంలో ఎంపిక చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అ ధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది షాపుల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, గౌడలకు రిజర్వేషన్ అమలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. హాజరైన మహిళా, పురుష వ్యాపారులు ఉత్సాహంగా కనిపించారు. రెండు జిల్లాల పరిధిలో 88 షాపులకు డ్రా నిర్వహించా రు. సుధాకర్‌గౌడ్ అనే వ్యక్తి రెండు దుకాణాలను దక్కించుకున్నారు. ఆటోడ్రైవర్‌గా కాలం వెల్లదీసిన ఎస్టీ తులసీరాంకు రిజర్వేషన్లో భాగంగా బాలానగర్ మద్యం షాపును కేటాయించారు. ధ న్వాడలోని 67, 68 దుకాణాలకు టెండర్లు త క్కువగా రావడంతో ప్రత్యేక తేదీలలో డ్రా తీయనున్నట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని ఆయనన్నా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, ఎక్సై జ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఖురేషి, అధికారులు పాల్గొన్నారు.
సజావుగా..
నాగర్‌కర్నూల్, నవంబర్ 20 : జిల్లాలోని మద్యం దుకాణాలను లక్కీడిప్ తీసి కేటాయించారు. శనివా రం ఉదయం జిల్లా కేంద్రంలోని సుఖజీవన్‌రెడ్డి గార్డెన్స్‌లో జిల్లా ఎక్సైజ్‌శాఖ ద్వారా షాపుల కేటాయింపు ప్రక్రియ నిర్వహించగా, కలెక్టర్ ఉదయ్‌కుమార్ పారదర్శకంగా లక్కీడీప్ తీసి దుకాణాలను వ్యాపారులకు కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 67 దుకాణాలకు 1507 టెండర్లు వచ్చాయి. ఇందులో కల్వకుర్తి సర్కిల్లోని షాపు నంబర్ 39కు అత్యధికంగా 51 టెండర్లు దాఖలయ్యాయి. అచ్చంపేట మండలం తుర్కపల్లిలోని షాప్ నం.31, లింగాలలోని షాప్ నం.63కు 10 దరఖాస్తుల కంటే తక్కువ వచ్చాయి. నిబంధనల ప్రకారం స్వల్పంగా వచ్చిన టెండర్లుగా భావించి తర్వాత కేటాయింపు చేయనున్నట్లు పక్కన పెట్టారు. మిగిలిన 65 షాపులకు ఉదయం 9 నుంచి టెండరుదారుల సమక్షంలో ఒక్కో షాపునకు టెండర్లు వేసిన వారి సమక్షంలో వారికి టోకన్లు చూపిస్తే అ త్యంత పారదర్శకంగా లక్కీడిప్ నిర్వహించారు. ఎక్సై జ్ సూపరింటెండెంట్ దత్తురాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో పో లీస్ బందోబస్తు మధ్య కేటాయింపులు సజావుగా ము గిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉత్కంఠంగా టెండర్ ప్రక్రియ కొనసాగింది. టెండర్ల ద్వారా మద్యం దుకాణాలు దక్కించుకు న్న వారిలో సంతోషం వ్యక్తం కాగా, దక్కనివారు నిరాశతో వెనుదిరిగా రు. చాలా వరకు బినామీల పే ర్లపై టెండర్లు దాఖలు కావడంతో స్థానికులకు వ చ్చాయా, ఇతర ప్రాం తాల వారికి వచ్చా యా అన్నది పాలుపోవడంలేదు. 12 వ వార్డు కౌన్సిల ర్ శకుంతల 50 టెండర్లు వేయ గా, రెండు దు కాణాలు దక్క డం విశేషం.
దుకాణాల కేటాయింపు
గద్వాల, నవంబర్ 20 : జోగుళాంబ గద్వాల జిల్లాలోని 36 మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో వ్యాపారులకు కేటాయించిన ట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. శనివా రం జిల్లా కేంద్రంలోని హరితహోటల్లో ఆబ్కా రీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల కేటాయింపులో కలెక్టర్ పాల్గొని ల క్కీడిప్ తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 36 మద్యం దుకాణాలకు 987 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 36 మద్యం దుకాణాల్లో శనివారం 33 దుకాణా లు మాత్రమే వ్యాపారులకు కేటాయించామని చెప్పారు. ధరూర్‌లో రెండు దుకాణాలు, గట్టులో ఒక దుకాణానికి తక్కువ దరఖాస్తులు రావడంతో డ్రా తీయలేదన్నారు. త్వరలో తేదీ నిర్ణయించి డిప్ తీసి కేటాయింపులు చేస్తామన్నారు. దుకాణాలు పొందిన వారు డిసెంబర్ 1వ తేదీ నుంచి దుకాణాలు తెరుచుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సూ పరింటెండెంట్ సైదులు, ఎక్సైజ్ అధికారులు గోపాల్, బానోత్, శ్రీనివాసులు, రాజేందర్, గోవర్ధన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.