కొత్తకోట, సెప్టెంబర్17: పట్టణంలో బ్రహ్మంగారి ఆలయం లో విశ్వకర్మ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పంచామృతాభిషేకం నిర్వహించి విశ్వకర్మ భగవాన్‌కి ప్రత్యేక పూజలు, హోమం చేశారు. అంతకుముందు పతావిష్కరణ, అన్నదానం, పల్లకీసేవ నిర్వహించారు. కార్యక్రమంలో సీడీసీ చెర్మన్ చెన్నకేశవరెడ్డి, విశ్వకర్మ సంఘం నాయకులు ఆనంద్‌చారి, వెంకటయ్యచారి, విశ్వమోహన్, నాగరాజు, రఘు, మోహన్, సంజీవచారి, ఆంజనేయులు, కృష్ణయ్యచారి, విజయ్, రమేవ్చారి, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు మండలంలో..
ఆత్మకూరు, సెప్టెంబర్ 17: మండలకేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక నీలకంఠేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విశ్వకర్మ భగవాన్‌కు పూజలు చేశారు. విశ్వకర్మ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, సంఘం అధ్యక్షుడు గాడి లక్ష్మీనారాయణ, కోశాధికారి బంగారు భాస్కర్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు ఐక్యంగా ఉండాలన్నారు. విశ్వకర్మ భగవాన్ ఊరేగింపు ఆటపాటలతో సాగింది. మహిళలు, యువకులు నృత్యాలతో ఉత్సాహంగా గడిపారు. అనంతరం నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యాక్షుడు శాంతాచారి, నరేశ్, ప్రకాశ్, రాజు, నరేశ్, నవీన్, రవి, శ్రీను, విష్ణు, చంద్రశేఖర్, యాదయ్య, చారి, శివరామాచారి, లక్ష్మీఆచారి, బాల్‌రాజు, డీకే రవి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
పెబ్బేరు మండలంలో..
పెబ్బేరు, సెప్టెంబర్ 17: విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపాలిటీలోని బ్రాహ్మంగారి ఆలయంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో భారీర్యాలీ చేపట్టారు. వనపర్తి డీఎస్పీ కిరణ్‌కుమార్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బ్రహ్మయ్యచారి, రామచంద్రయ్యచారి, నాగరాజుఆచారి, గోవర్ధనాచారి, వెంకటస్వామిచారి, రమేశ్ చారి, ఈశ్వర్‌చారి తదితరులు పాల్గొన్నారు.
గోపాల్పేట మండలంలో..
గోపాల్పేట, సెప్టెంబర్ 17: మండలకేంద్రంలో విశ్వకర్మ జయంతిని శుక్రవారం విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి విశ్వకర్మ చిత్రపటానికి పూజలు చేశారు. కార్యక్రమంలో వీరబ్రహ్మాచారి, బలరాంఆచారి, ప్రసాద్ఆచారి, దశరథంఆచారి, విష్ణుఆచారి, శ్రీనివాసులుఆచారి తదితరులు పాల్గొన్నారు.