ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
రూ.73 లక్షల వ్యయంతో పోల్కంపల్లిలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 15 : రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ప్రతి పల్లె అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో రూ.73లక్షల వ్యయంతో నిర్మించిన సీసీరోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, కంపోస్టుయార్డు, అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. నాగన్‌పల్లి గ్రామంలో రామోజీఫౌండేషన్ ఆధ్వర్యంలో సకల హంగులతో నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామం అభివృద్ధిలో ముందుండాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఉన్నత ఆశయంతో పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇంటింటికీ తడి, పొడి చెత్తబుట్టలు పంపిణీ చేసి ప్రతిరోజు ట్రాక్టర్ల ద్వారా చెత్తసేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పల్లెలంటే ప్రాణమని చెప్పారు. నాగన్‌పల్లి గ్రామానికి కూతవేటు దూరంలోఉన్న రామోజీ ఫిలింసిటీ యాజమాన్యం నాగన్‌పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామంలో సీసీరోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వసతి, వీధిదీపాలు, నూతన గ్రామపంచాయతీ భవనం, పాఠశాల భవనం, నూతన డ్వాక్రా భవనం, రచ్చబండ, బస్టాండుతో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పించడం సంతోషకరమన్నారు. అనంతరం హరితహారంలో భాగంగా నూతన గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో దవాఖానాలో చికిత్స పొంది, ఇంటికే పరిమితమైన ఇబ్రహీంపట్నం మండ లం కోఆప్షన్ సభ్యుడు షరీఫ్‌ను ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, వైస్ ఎంపీ పీ ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్‌లు చెరుకూరి ఆండా ళు, ఎర్ర జగన్, ఎంపీటీసీ చెరుకూరి మంగ రవీందర్, ఎంపీడీవో మహేశ్‌బాబు, ఏఈ ఇంద్రసేనారెడ్డి, ఈవోపీఆర్డీ సురేశ్‌రెడ్డి, ఉపసర్పంచ్లు జంగారెడ్డి, బీరప్ప, సహకార సంఘం చైర్మన్ రాజశేఖర్‌రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మణ్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు పాల్గొన్నారు.
దేవాలయాల అభివృద్ధికి కృషి
యాచారం : దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్నెడ్డి అన్నారు. మండలంలోని నల్లవెల్లి గ్రామంలో కంఠమహేశ్వరస్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బుధవారం పురోహితుల వేదమంత్రాలతో ఘనంగా నిర్వహించారు. కంఠమహేశ్వరస్వామి, సూరమాంబదేవి, మైసమ్మ, ఎల్లమ్మ, గణపతి, నంది, ధ్వజ కౌండిన్య మహాముని, సింహవాహన ప్రతిష్ఠ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం కంఠమహేశ్వరస్వామి, సూరమాంబదేవి కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్, నాయకులు వెంకటరమణారెడ్డి, చిన్నోళ్ల యాదయ్య, కారింగు యాదయ్య, లక్ష్మిపతిగౌడ్, యాదయ్యగౌడ్, గండికోట యాదయ్య పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
హయత్‌నగర్ రూరల్ : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలను ఆపదలో ఆదుకుంటున్నదని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారానికి చెందిన యాదగిరికి రూ.40 వేలు, కవితకు రూ.25 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రమావత్ పరశురాం తదితరులు పాల్గొన్నారు.