
మిరుదొడ్డి/మర్కూక్, నవంబర్ 15 : రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మిరుదొడ్డి, కాసులాబాద్ గ్రామాలకు చెందిన 8 మంది బాధితులకు సోమవారం ఎంపీపీ గజ్జల సాయిలు, జడ్పీటీసీ సూకురి లక్ష్మీ లింగం, పీఏసీఎస్ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, ఏఎంసీ చైర్మన్ వల్లాల సత్యనారాయణ, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు తుమ్మల బాల్‌రాజు కలిసి సంయుక్తంగా రూ.3,43500 చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు రంగమైన రాములు, కిష్టయ్య, ఎంపీటీసీలు లక్ష్మీ మల్లయ్య, సుతారి నర్సింహులు, కో-ఆప్షన్ సభ్యు డు ఎండీ ఆహ్మద్ పాల్గొన్నారు.
మర్కూక్‌లో..
మర్కూక్ మండలంలోని దామరకుంట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల్లోని మధ్యాహ్న భోజన వంటకాలను సోమవారం మండల పరిషత్ అధ్యక్షుడు తాండ పాండుగౌడ్, జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, ఎంపీటీసల ఫోరం అధ్యక్షుడు కృష్ణయాదవ్ పరిశీలించారు. అనంతరం గ్రామానికి చెందిన ఎండీ ఖలీల్‌కు రూ. 40 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఆయన వెంట గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు మహేశ్‌యాదవ్, పత్తిబాబు యాదవ్, ఉప సర్పంచ్ బాలమల్లు, నాయకుడు బాల్ నర్స య్య ఉన్నారు.