నేటి నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
24న పరిశీలన.. 26 వరకు ఉపసంహరణ
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఎన్నిక ఏకపక్షమే..
ఆదిలాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నేడు విడుదల కానున్నది. నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 24న నామినేషన్లు పరిశీలించనుండగా, 26వ తేదీ వరకు ఉపసంహరణకు ఎన్నికల కమిషన్ అవకాశమిచ్చింది. 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా టీఆర్ఎస్కు చెందిన వారే కాగా, ఎన్నిక ఏకపక్షం కానున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. ఈ ఎన్నికల నిర్వహణ లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఈ నెల 9న షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికలకు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్త పట్నాయక్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. నోటిఫికేషన్ విడుదల అనంతరం నేటి నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లను స్వీకరిస్తా రు. 24న పరిశీలన, 26 వరకు ఉపసంహరణకు ఉంది. ఈ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో పాటు ము న్సిపాలిటీల కౌన్సిలర్లు, ఓటర్లుగా ఉంటారు. ఆదిలాబాద్ జిల్లా లో 17 మంది జడ్పీటీసీలు, నిర్మల్ జిల్లాలో 18 మంది, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మంది, మంచిర్యాల జిల్లాలో 16 మంది ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీటీసీలు 158 మంది, నిర్మల్ జిల్లాలో 156 మంది, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 127 మం ది, మంచిర్యాల జిల్లాలో 130 మంది ఉన్నారు. కౌన్సిలర్ల విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లాలో 49 మంది, నిర్మల్ జిల్లాలో 80 మంది, ఆసిఫాబాద్ జిల్లాలో 30 మంది, మంచిర్యాల జిల్లాలో 150 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు చెందిన వారు ఉన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సై తం టీఆర్ఎస్కు చెందిన వారు ఎక్కువగా ఉం డటంతో ఎమ్మె ల్సీ ఎన్నిక ఏకపక్షం కానుంది. నేటి నుంచి నా మినేషన్ల ప్రక్రి య ప్రారంభంకానుండగా అధికారులు ఏర్పాట్లు చేశారు.