సూర్యాపేట అర్బన్, మే 14 : అనుకోని కారణాల ద్వారా మధ్యలో చదువు మానేసిన వారు, ఉద్యోగం చేస్తున్న పదోన్నతుల కోసం ఉన్నత చదువులు చదవాలనుకునే వారి కోసం ప్రభుత్వం కల్పించిన అవకాశం దూర విద్య. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం కల్పించే ఓపెన్ స్కూల్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఓపెన్ స్కూల్లో ప్రవేశాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఓపెన్ స్కూల్ పరిధిలో టెన్త్, ఇంటర్ కోర్సులపై అభ్యర్థులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. రెగ్యులర్ కోర్సు సర్టిఫికెట్లకు ఉన్న గుర్తింపును దూర విద్య పూర్తి చేసిన అభ్యర్థ్ధులకు ఎక్కువ మంది అడ్మిషన్ పొందుతున్నారు . రెండు జిల్లాలో గతేడాది 5,866 ఆడ్మిషన్లు పొందగా ఈ యేడాది 7,115 మంది అభ్యర్థ్ధులు ప్రవేశాలు తీసుకున్నారు. కరోనా సమయంలో సైతం ఆన్లైన్ ద్వారా తరగతులను నిర్వహించడంతో మరింతమంది ప్రవేశాలకు ముందుకు వస్తున్నారు.
స్టడీ సెంటర్ల వివరాలు
రెండు జిల్లాల పరిధిలో పదవ తరగతికి నల్లగొండ జిల్లా పరిధిలో 45 కేంద్రాలు, ఇంటర్‌కు 49 కేంద్రా లు అందుబాటులో ఉన్నా యి. సూర్యాపేట జిల్లా పరిధిలో పదవ తరగతికి 23 కేంద్రాలు ,ఇంటర్‌కు 31 కేంద్రాలను ఏర్పాటు చేశారు.రెండు జిల్లాల పరిధిలో పదో తరగతికి మొత్తం 68 కేంద్రాలు,ఇంటర్‌కు 80 కేంద్రాలను అందుబాటులో ఉన్నాయి. పది,ఇంటర్‌కు సంబందించి ఇప్పటికే ప్రవేశాలను అధికారులు పూర్తి చేశారు.రెండు జిల్లాల పరిధిలో గత సంవత్సరం 5,866 మంది అభ్యర్ధులు ప్రవేశాలు పొందగా ఈ సంవత్సరం 7,115 మంది ప్రవేశాలు సాధించారు.
ఉచితంగా పాఠ్యపుస్తకాలు
దూర విద్యలో ప్రవేశాలు పొందిన పది, ఇంటర్ అభ్యర్థ్ధులకు ప్రభుత్వం ఉచితంగానే పాఠ్యపుస్తకాలను అందజేస్తున్నది .ఇప్పటివరకు ప్రవేశాలు పొందిన 7,115 మందికి పుస్తకాలను అందించడంతో పాటు ప్రతి విద్యా సంవత్సరంలో 40 రోజుల పాటు తరగతులు నిర్వహిస్తున్నారు.ప్రవేశాలు పొందిన అభ్యర్థ్ధులకు ఇబ్బందులు లేకుండా సెలవు రోజుల్లో మాత్రమే తరగతులు నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో కొవిడ్ నిబంధనలుపాటిస్తూ ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ పరీక్షలకు సిద్ధ్దం చేస్తున్నారు.
జిల్లాలో పెరిగిన అడ్మిషన్లు
గత సంవత్సరం నల్లగొండ జిల్లాలో పదో తరగతి, ఇంటర్లో 4,139 మంది ప్రవేశాలు పొందగా ఈ సంవత్సరం 4,572 మంది, సూర్యాపేట జిల్లాలో గత సంవత్సరం పదోతరగతి, ఇంటర్లో కేవలం 1,727 మంది అభ్యర్థ్ధులు ప్రవేశాలు పొందగా ఈ సారి 2,543 పెరిగింది. రెండు జిల్లాలో రెండు సంవత్సరాల్లో పెరిగిన ప్రవేశాల వివరాలు ఇలా ఉన్నాయి.