e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జగిత్యాల కరోనా బాధితులకు అండగా..

కరోనా బాధితులకు అండగా..

కరోనా బాధితులకు అండగా..

ఎమ్మెల్యే చెన్నమనేని ఔదార్యం
ములవాడలో 100 పడకల దవాఖానకు 15 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు
కలెక్టర్‌కు అందజేసిన జడ్పీ అధ్యక్షురాలు అరుణ
ఎమ్మెల్యే చొరవ అభినందనీయం: కృష్ణభాస్కర్‌

వేములవాడ, మే 13: ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు కరోనా బాధితులకు అండగా నిలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణవాయువు అవసరం పెరిగిపోతున్నందున ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందించాలని నిర్ణయించారు. వేములవాడ దవాఖాన కోసం తన సొంత నిధులు దాదాపు 10లక్షలతో 15 ఫిలిప్స్‌ కంపెనీ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను కొనుగోలు చేసి జర్మనీ దేశం నుంచి పంపించగా, గురువారం జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, మున్సిపల్‌ అధ్యక్షురాలు మాధవి కలిసి దవాఖాన ఆవరణలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులల్లో కరోనా వైరస్‌ బాధితులకు ప్రాణవాయువు ఎంతో అవసరమని, ఎమ్మెల్యే రమేశ్‌బాబు చొరవ తీసుకొని ఉచితంగా అందించడం అభినందనీయమని చెప్పారు. వేములవాడ దవాఖాన ప్రారంభమయ్యేలోగా.. సిరిసిల్ల జిల్లా దవాఖాన లో వినియోగిస్తామని చెప్పారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ మాట్లాడుతూ వేములవాడ ప్రాంత ప్రజల కోసం సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో ఎమ్మెల్యే రమేశ్‌బాబు రూ.20కోట్లతో వందపడకల దవాఖానను నిర్మిస్తున్నారని, త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నదని చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ ఆవుల సుమన్‌మోహన్‌రావు, వైద్యాధికారి రేగులపాటి మహేశ్‌రావు, ఎంపీపీ బూర వజ్ర మ్మ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మధురాజేందర్‌, జడ్పీటీసీ మ్యా కల రవి, ఏఎంసీ చైర్మన్‌ గడ్డం హన్మండ్లు, సింగిల్‌విండో చైర్మన్లు బండ నర్సయ్యయాదవ్‌, రేగులపాటి కృష్ణదేవరావు, కౌన్సిలర్లు జోగిని శంకర్‌, మారం కుమార్‌, యాచమనేని శ్రీనివాసరావు, ఇప్పపూల అజయ్‌, నరాల శేఖర్‌, గోలి మహేశ్‌, నాయకులు రాఘవరెడ్డి, బాబు, రాజు, యేస తిరుపతి, తదితరులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా బాధితులకు అండగా..

ట్రెండింగ్‌

Advertisement