మిడ్జిల్, అక్టోబర్ 11 : పేదలు ఆత్మగౌరవం తో జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని బోయిన్పల్లి, చిల్వేర్ గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, వైకుంఠ ధామం, పల్లెప్రకృతి వనం, బీసీ కమిటీ హాల్, రా ణిపేటలో రైతువేదిక భవనాలను ప్రారంభించా రు. తాసిల్దార్ కార్యాలయంలో 91 మందికి క ల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొంత జాగాలో ఇం డ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం ఆర్థిక సా యం చేస్తుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎ త్తిపోతల పూర్తయితే నియోజకవర్గంలో సుమా రు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తామన్నా రు. దళిత బంధు పథకాన్ని విడుతల వారీగా రా ష్ట్రమంతా అమలు చేయనున్నట్లు చెప్పారు. అ నంతరం కొత్తపల్లి ఎంపీటీసీ శంకరయ్య రెండు రోజుల కిందట కాంగ్రెస్‌లో చేరగా, మళ్లీ ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అలాగే చిల్వేర్ గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ నాయకులు గులాబీ తీర్థం పుచ్చుకున్నా రు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శశిరేఖ, ఎంపీపీ కాంతమ్మ, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ తిరుపతమ్మ, ఎంపీటీసీలు సుదర్శన్, రా జారెడ్డి, సర్పంచులు జంగారెడ్డి, నారాయణరెడ్డి, సంయుక్తరాణి, నిరంజన్, నాయకులు పాండు, శ్యామల్‌రెడ్డి, సుధాబాల్రెడ్డి, శ్రీనివాసులుగుప్త, బాలు, ఎల్లయ్యయాదవ్, వెంకట్, జైపాల్‌రెడ్డి, భద్రయ్య, నాగరాజుగౌడ్, శివప్రసాద్, బాబా, బంగారు తదితరులు పాల్గొన్నారు.
గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి..
ఊర్కొండ, అక్టోబర్ 11 : గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మండలం ఏర్పడి ఐదేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా సోమవా రం ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఊర్కొండ స్టేజీ వద్ద గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, సం గీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిరినాయక్, ఎంపీటీసీ గోపాల్గుప్తా, కో ఆప్షన్ సభ్యుడు ఖలీంపా షా, నాయకులు జంగయ్య, రమేశ్, శ్రీధర్‌రెడ్డి, నాగోజీ, కృష్ణగౌడ్, అమరేశ్వర్‌రెడ్డి, హరీశ్, పరశురాములు, చంద్రకాంత్, రవి, శ్రీశైలం, సిద్దు, గోపి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ హయాంలో అధోగతి..
నవాబ్‌పేట, అక్టోబర్ 11 : 70 ఏండ్ల కాం గ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతం అధోగతి పా లైందని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ల క్ష్మారెడ్డి తెలిపారు. మండలంలోని ఫతేపూర్ మై సమ్మ దేవాలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవా లు, హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం మండల కేంద్రంలోని జీపీ కా ర్యాలయ ఆవరణలో 43 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు, బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, బతుకమ్మ చీరెలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్ర భుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తుండడంతో ఏం చేయాలో తోచక పనికి రాని మాటలు మా ట్లాడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, తాసిల్దార్ రాజేందర్‌రెడ్డి, ఎంపీవో శ్రీలత, వైస్ ఎంపీపీ సంతోష్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ డీఎన్రా వు, సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు గోపా ల్, తాహెర్, నాగిరెడ్డి, లక్ష్మయ్య, అబ్దుల్లా, నవనీతరావ్, కృష్ణయ్య, నరేందర్, శంకర్‌నాయక్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.