ఆత్మకూరు, అక్టోబర్ 11: కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ పట్టణంలో ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటికే ఐదు వార్డుల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తికాగా మిగిలిన వార్డుల్లోనూ వందశాతం లక్ష్యంగా ఆరోగ్యసిబ్బంది వ్యాక్సినేషన్‌ను కొనసాగిస్తున్నారు. సోమవారం 5వ వార్డులో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ను చైర్పర్సన్ గాయత్రీయాదవ్ పర్యవేక్షించారు. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు రవికుమార్‌యాదవ్, కమిషనర్ రమేశ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
అన్నారంతండాలో..
పాన్‌గల్, అక్టోబర్ 11 : మండలంలోని అన్నారంతం డా సర్పంచ్ రంగానాయక్ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ఇంటింటా కరోనా వ్యాక్సిన్ జోరందుకున్నది. తం డా లో వందశాతం మందికి వ్యాక్సిన్ వేయించాలనే లక్ష్యం తో సర్పంచ్ రంగానాయక్, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి వైద్య సిబ్బందితో కలిసి ఇంటింటా తిరిగి 18 ఏండ్లు పైబడినవారికి కరోనా టీకా వేయించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బం ది పాల్గొన్నారు.
వంద శాతం వ్యాక్సినేషన్ సాధించాలి
పెబ్బేరురూరల్, అక్టోబర్ 11 : కరోనా వైరస్ నివారణ కు వేస్తున్న వ్యాక్సినేషన్ వంద శాతం సాధించాలని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన పెబ్బేరు మండలం రంగాపురంలోని వ్యాక్సినేషన్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన వారంద రూ విధిగా టీకా తీసుకోవాలని కోరారు. అదేవిధంగా మండలంలోని రాంపురం గ్రామం వంద శా తం వ్యా క్సినేషన్ సాధించింది. ఈ మేరకు సోమవా రం సర్పంచ్ బస్వరాజు ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది వెంకటమ్మ, శారద, నస్రీన్‌ను గ్రామస్తులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
గోపాల్‌పేటలో..
గోపాల్పేట, అక్టోబర్ 11 : మండల కేంద్రంతోపాటు తాడిపర్తి, చెన్నూరు గ్రామాల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కేంద్రాలను సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. గ్రామంలో ఉండి వ్యాక్సిన్ తీసుకొని వారి లి స్టు, మైగ్రేషన్ లిస్టు చూశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. అదేవిధంగా బుద్ధారం గ్రామంలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవి శంకర్ సందర్శించారు. కార్యక్రమంలో డాక్టర్ మంజుల, తాసిల్దా ర్ నరేందర్, ఎంపీడీవో కరుణశ్రీ, సర్పంచులు పద్మమ్మ, శేషిరెడ్డి, వైద్య సిబ్బంది సురేశ్ కుమార్, శోభారాణి, నాగలక్ష్మి, అంగన్వాడీలు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి
వీపనగండ్ల, అక్టోబర్ 11 : వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని ఎంపీడీవో కతలప్ప తెలిపారు. సోమవారం తూంకుంట గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. నాగర్లబండతం డా, రంగవరం గ్రామాల్లో ఇప్పటికే వంద శాతం ప్రజలు వ్యాక్సిన్ వేయించుకున్నారు. అదేవిధంగా కల్వరాల గ్రా మంలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు ఎండీ సర్ధార్ ఆధ్వర్యం లో ఇంటింటా ప్రజలకు చైతన్యం కల్పిస్తూ.. రెవెన్యూ, వైద్య సిబ్బందికి సహకారమందిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమాని నిర్వహించారు. కార్యక్రమంలో వీఆర్వో కృష్ణయ్య, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.