ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
నారాయణపేట, అక్టోబర్ 10 : పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఎమ్మెల్యే ఎస్.రా జేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ నూతన కమిటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కమిటీలోని సభ్యులు నూతనోత్సాహంతో పని చేస్తూ పదవులను సమర్థవంతంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు. రా బోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ పటిష్ఠతకు కృ షి చేయాలన్నారు. ప్రతి కార్యకర్తకు తాను అందుబాటులో ఉంటానన్నారు. అనంతరం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, కౌన్సిలర్లు, నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి..
మండలంలోని లింగంపల్లి శివారులో నిర్మించిన బాగ్యలక్ష్మీ కాటన్ ఇండస్ట్రీస్‌ను ఎమ్మెల్యే ప్రా రంభించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ పత్తి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ చేతన, ప్రజాప్రతినిధు లు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని బీసీ కాలనీలో వెలిసిన మైసమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకు న్న ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కా ర్యక్రమం ప్రారంభించారు. అలాగే ప ట్టణంలోని మెట్రో గార్డెన్ ఫంక్షన్ హాల్లో సైకిల్ రాములు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.
పిల్లలకు కరాటే నేర్పించాలి
నారాయణపేట టౌన్, అక్టోబర్ 10 : ఆత్మరక్షణ కోసం ప్రతి కుటుంబంలో పిల్లలకు ముఖ్యంగా బాలికలకు కరాటే నేర్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. 7వ నేషనల్ ఓపెన్ కరాటే చాంపియ న్ షిప్ 2021లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆదివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మె ల్యే పతకాలను, మెమెంటోలను అందజేశారు. అనంతరం విద్యార్థులను అభినందించారు. కార్యక్రమం లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జగదీశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షడు విజయ్‌సాగర్, ప్రధానకార్యదర్శి చె న్నారెడ్డి, సీనియర్ నాయకులు గందె చంద్రకాంత్, సుదర్శన్‌రెడ్డి, విద్యార్థులు అనురాధ, వైశాలి, సంతో షి, మహేశ్వరి, నాగరాజ్, నవీన్, మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.
భక్తి భావం కలిగి ఉండాలి
ధన్వాడ, అక్టోబర్ 10 : నవరాత్రి ఉత్సవాలను బాగా నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరిలో భక్తి భావం కలిగి ఉండాలని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. రజక సంఘం మండల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్దకు ఆదివారం ఎమ్మెల్యే పాల్గ్గొని ప్రత్యేక పూజలు చేశారు. అ నంతరం రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ రజక సంఘం నా యకులను అభినందించారు. మీరు చేస్తున్న నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా ఉన్నాయంటూ కితాబునిచ్చారు. అ నంతరం ఎమ్మెల్యేను రజక సంఘం నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ అమరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ సుధీర్‌కుమార్, నాయకులు, రజక సంఘం సభ్యులు తది తరులు పాల్గొన్నారు.