ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల, అక్టోబర్ 10 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మల్దకల్ మండలం అమరవాయి గ్రామానికి చెందిన కృష్ణన్న అనారోగ్యంతో మృతిచెందగా ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.5లక్షల రైతు బీమా చెక్కును ఆయన భార్య లక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్ర భుత్వం అందించే సాయాన్ని రైతు కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గోపాల్‌రెడ్డి నాయకులు కృష్ణారెడ్డి, జాన్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
మహిళల ఆత్మరక్షణకు కరాటే అవసరం
ప్రస్తుత సమాజంలో మహిళల ఆత్మరక్షణ కోసం కరాటే అవసరమని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో కుంగ్‌ఫూలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఎమ్మెల్యే సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా యోగా, వాకింగ్ వంటివి ప్రతి రోజూ చేయాలన్నారు. ఇక్కడ బెల్టులు సాధించిన క్రీడాకారులు జాతీయస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చి గద్వాల ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్ కృష్ణ పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే జిల్లా కేంద్రంలోని బాలాజీ వీధిలోని శివాలయం లో దుర్గాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నూతనంగా ప్రతిష్ఠించిన నవగ్రహ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్‌చైర్మన్ బాబర్, నాయకులు కృష్ణకుమార్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
మాజీ సర్పంచ్‌కు పరామర్శ
ధరూరు, అక్టోబర్ 10 : టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డిని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పరామర్శించారు. ఇటీవల అపరేషన్ చేయించుకున్న ఆయనను మండల కేంద్రంలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే కలిసి పరామర్శించి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా కేటీఆర్ యువసేన ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ నర్సింహులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డీఆర్ విజయ్, నాయకుల జాంపల్లె వెంకటేశ్వర్‌రెడ్డి, చక్రధర్‌రావు పాల్గొన్నారు.