నేర్చుకున్న చదువును సమాజం కోసం ఉపయోగించాలి
టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా
‘వాగ్దేవి’లో స్నాతకోత్సవ వేడుకలు
కిట్స్, కేయూలో టాస్క్ ప్రతినిధులతో సమావేశం
హసన్‌పర్తి, అక్టోబర్ 9: విద్యార్థులు నైపుణ్యాల ను మెరుగు పరుచుకోవాలని తెలంగాణ అకాడ మీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) సీఈవో శ్రీ కాంత్ సిన్హా అన్నారు. బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల స్నాతకోత్సవ వేడుకలు ఎర్ర గట్టుగుట్ట కేఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. తాము నేర్చుకున్న చదువు సమా జం కోసం ఉపయోగించాలని అన్నా రు. చదువు చెప్పిన గురువులకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతులుగా ఉండలన్నారు. కార్యక్రమంలో టా లెంట్ డెలివరీ హెడ్ సుధీర్మధుర కవి, ఎంఎన్సీ డైరెక్టర్ కామేశ్వర్, సీనియర్ అడ్వైజర్ సురభిరెడ్డి కళాశాల ప్రిన్సిపాళ్లు డాక్టర్ కే ప్రకాశ్, డాక్టర్ పీ ప్రసాద్‌రావు, విశ్వంభర్ ఎడ్యుకేషనల్ సొసైటీ జా యింట్ సెక్రటరీ డాక్టర్ సీహెచ్ సత్యపాల్‌రెడ్డి, డీన్స్ శశిధర్, శర్మ, వివిధ విభాగాల అధిపతులు, రామ్ తదితరులు పాల్గొన్నారు.
‘కిట్స్’ విద్యార్థులకు గుర్తింపు
కిట్స్ కళాశాలలో చదివి ఉద్యోగాలు సాధించిన వారికి జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చిందని టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా అన్నారు. ఎర్రగట్టు గుట్టలోని కిట్స్ కళాశాలలో ఆయన మాట్లాడుతూ కిట్స్ విద్యార్థులు సాంకేతికతలో ముందుకు పోతు న్నారని అన్నారు. కిట్స్ కరస్పాండెంట్ కెప్టెన్ లక్ష్మీ కాంతారావు, కోశాధికారి నారాయణరెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు సమర్థవంతంగా గ్రామీణ యువతకు ఉద్యోగ ఆధారిత శిక్షణ, ఉపా ధి అవకాశాలు అందించడానికి చేసిన ప్రయత్నా లను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అశోక్‌రెడ్డి, టాస్క్ క్లస్టర్ మేనేజర్ సుధీ ర్, డీఆర్ఎం రామకృష్ణన్, విజయ్‌కుమార్, పీఆర్ వో ప్రభాకరాచారి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులను ఉద్యోగార్థులను చేయడమే లక్ష్యం