13వ తేదీ వరకు ‘రైతుబంధు’ పండుగ
జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్
ములుగురూరల్, జనవరి 9 : రైతుబంధు పథకం దేశంలోనే అద్భుత పథకమని, రైతు బిడ్డగా సీఎం కేసీఆర్ రైతుల కష్టాలను దూరం చేస్తున్నారని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లీల గార్డెన్లో ఆదివారం నియోజకవర్గ రైతుబంధు సంబురాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు, పీఏసీఎస్ చైర్మన్లకు దిశానిర్ధేశం చేశారు. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఘనంగా సంబురాలు జరుపుకోవాలి పిలుపునిచ్చారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఇప్పటికే రూ. 50వేల కోట్లు అందజేసినట్లు తెలిపారు. రైతులకు అండగా ఉండే పార్టీ టీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. నీళ్లు, పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్ ఇచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ ఒక్కరే అని కొనియాడారు. జిల్లాలోని గంగారం, కొత్తగూడ మండలంలో సోమవారం జరిగే రైతుబంధు సంబురాల్లో రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పాల్గొంటారని తెలిపారు. అన్ని మండలాల నుంచి టీఆర్ఎస్ నాయ కులు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, ఒడీసీఎంఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీలు సకినాల భవాని, గై రుద్ర మదేవి అశోక్, కో ఆప్షన్ వలియాబీ, ఎంపీపీలు గండ్రకోట శ్రీదేవి సుధీర్‌యాదవ్, సూడి శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్, లింగాల రమణారెడ్డి, సూరప నేని సాయిబాబు, నూశెట్టి రమేశ్, సుబ్బుల సమ్మయ్య, కే వేణుయాదవ్, కుడుముల లక్ష్మీనారాయణ, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోరిక విజయ్‌రాంనాయక్, మలా రమేశ్, డీసీసీబీ డైరెక్టర్ మాడుగుల రమేశ్, పీఏసీఎస్ చైర్మన్లు రమేశ్, కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్లు కేశెట్టి కుటుంబరావు, ములుగు పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్‌కుమార్, సీనియర్ నాయకులు పోరిక గోవింద్‌నాయక్, టీఆర్ఎస్వై నియోజకవర్గ కన్వీనర్ కొగిల మహేశ్, నాయకులు లకావత్ నర్సింహానాయక్, మురళి, రాజుయాదవ్, చిన్నకృష్ణ, నారాయణ, మురహరి భిక్షపతి, ఈసం సమ్మయ్య, మంద రవి, మెరుగు సంతోష్, బొచ్చు సమ్మయ్య, సదయ్య, గడ్డమీద భాసర్, బానోత్ వెంకన్న, అజారుద్దీన్, రాజా హుస్సేన్, ఓదెల శరత్ పాల్గొన్నారు.