అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
కాటారం, మహదేవపూర్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష
కాటారం/ మహదేవపూర్, ఆగస్టు 7 : గ్రామాల్లోని దళిత, గిరిజన వాడల్లో మౌలిక వసతులు కల్పించి సమగ్ర అభివృద్ధి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్ర త్యేక దృష్టి సారించాలని అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కాటారం, మహదేవపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీలు పంతకాని సమ్మయ్య, రాణీబాయి అధ్యక్షతన జరిగిన సమావేశానికి అడిషనల్ కలెక్టర్ హాజరయ్యారు. సర్పంచులు, ఎంపీటీసీలతో దళి త, గిరిజన వాడల్లో ఉన్న సమస్యలను గుర్తించి సత్వర పరిష్కారం చూపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రా మ పంచాయతీలో దళిత, ఎస్టీ వాడల్లో పర్యటించి వారికున్న సమస్యలను గుర్తించాలన్నారు. అభివృద్ధి పనులకు ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని కోరారు. మహదేవపూర్ మండలంలోని శ్మశాన వాటిక నిర్మాణాలు, సెగ్రిగేషన్ షెడ్ల పనులు పూర్తికాలేదని, వారం రోజుల్లో పెండిం గ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శ్మశానవాటికలకు కరంటు, నీటి సౌకర్యం కోసం బోరు, మోటరు, రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు.
ఉపాధి హామీ పథకంపై నిర్వహించిన సమీక్షలో ప్రతి గ్రామంలో నిర్దేశించిన టార్గెట్ మేరకు హరితహారం కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. దళిత కాలనీలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అదే కాలనీలో స్థలాన్ని గుర్తించి ప్రపోజల్స్ పంపాలని ఆదేశించారు. కాటారం ఎంపీపీ మాట్లాడుతూ ఈ సమావేశం ఏదైనా దళితవాడలో ఏర్పాటుచేస్తే బాగుంటుందని అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అ లాగే మండలంలో విద్యుత్ శాఖకు సంబంధించిన ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, ఇతర మండలాల నుంచి డిప్యుటేషన్‌పై ఉద్యోగులను కేటాయించాలని కోరా రు. సానుకూలంగా స్పందించిన ఆయన పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మహదేవపూర్ ఎంపీపీ మాట్లాడుతూ బృహత్ పల్లె పకృతి వనానికి కేటాయించిన స్థలం అనువు గా లేదని, మహదేవపూర్ గ్రామంలో అనువైన ప్రదేశాన్ని చూడాలని అడిషనల్ కలెక్టర్ తహసీల్దార్‌ను ఆదేశించారు. మండలానికి వచ్చిన అడిషనల్ కలెక్టర్‌ను ఎంపీపీ రాణీబాయి, ఎంపీటీసీ మమత శాలువాతో సన్మానించారు. వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో జడ్పీ సీఈవో శోభారాణి, కాటారం ప్రత్యేక అధికారి అక్బర్, ఎంపీడీవోలు పెద్ది ఆంజనేయులు, శంకర్, ఎంపీవో మల్లికార్జున్ రెడ్డి, వైస్ ఎంపీపీ చీర్ల తిరుమల, ఎంపీటీసీలు తోట జనార్దన్, జాడి మహేశ్వరి, రాజమణి, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.