పరిగి, జనవరి 7: మన సంస్కృతీసంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉన్నదని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్‌రెడ్డి సతీమణి సీతారంజిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సం క్రాంతి సంబురాల్లో భాగంగా విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భం గా జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో సీతారంజిత్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఎంపీ రంజిత్‌రెడ్డి ఆలోచనల ప్రతిరూపమే ఆర్ఆర్ ఫౌండేషన్ అని తెలిపారు. ఈ ఫౌండేషన్ ద్వారా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందన్నారు. త్వరలోనే విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. ఈ పోటీల్లో బాలురు సైతం ముగ్గులు వేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సతీమణి ప్రతిమారెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతీసంప్రదాయాలకు ప్రతిరూపం ముగ్గులని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు సీతారంజిత్‌రెడ్డి, ప్రతిమారెడ్డి బహుమతులను అందజేశారు. జూనియర్ కళాశాలలో గణితం బో ధిస్తున్న అధ్యాపకుడికి నెలకు రూ.5 వేల చొప్పు న అందిస్తున్న జడ్పీటీసీ హరిప్రియాప్రవీణ్కుమార్రెడ్డిని అధ్యాపకులు సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, జడ్పీటీసీ హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆంజనేయు లు, సీనియర్ నాయకుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సయ్యద్‌పల్లి సర్పంచ్ వెంకట్రాంకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వెంకటయ్య, మధు, కౌన్సిల ర్లు రవీంద్ర, మునీర్, లక్ష్మి, కళాశాల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్పై దృష్టి సారించాలి
దోమ, జనవరి 7: విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్పై దృష్టి సారించాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యు డు రంజిత్‌రెడ్డి సతీమణి సీతారంజిత్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్ఆర్ ఫౌండేషన్ డైరెక్టర్ సీతారంజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థినులకు ముగ్గుల పోటీ లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విజేతలకు ఫౌండేషన్ తరఫున జ్ఞాపికలతోపాటు మొ దటి బహుమతిగా రూ.ఐదువేలు, రెండో బహుమతిగా రూ.మూడు వేలు, మూడో బహుమతిగా రూ.రెండు వేలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సా మాజిక కార్యక్రమాలు, నిరుద్యోగులకు ఉపాధి కల్పన, విద్యార్థుల్లో దాగిఉన్న స్కిల్ డెవలప్మెంట్ను వెలికి తీసేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం నిర్వహించిన కళాశాల ప్రిన్సిపాల్ మంజులను శాలువాతో సత్కరించారు. అనంతరం సీతారంజిత్రెడ్డిని ఎంపీపీ అనసూయ సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్లేశం, సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ అనిత, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ యాదయ్యగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్‌గౌడ్, లక్ష్మణ్, రాఘవేందర్‌రెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.