కవులకు, కళలకు పుట్టినిల్లు వనపర్తి
బాలభవన్‌ను బాలకేంద్రంగా అభివృద్ధి చేద్దాం
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : కవులకు, కళలకు, కళాకారులకు పుట్టినిల్లు వనపర్తి జిల్లా అని, ఈ ప్రాంత సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకుందామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. బాలభవన్‌గా బాలకేంద్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ మంత్రి నిరంజన్‌రెడ్డిని సాహిత్య కళాసభ్యులు వనపర్తి జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కళలకు, కళాకారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. బాలకేంద్రాన్ని బాలభవన్‌గా అభివృద్ధి చేసుకుందామని మం త్రి హామీ ఇచ్చారు. లలిత కళలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని అన్నారు. వనపర్తి తొలి శాసనసభ్యులు సురవరం ప్రతాపరెడ్డి పేరు మీద పార్క్ ఏర్పాటు చేసి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎడ్యుకేషన్ హబ్‌గా పేరొందిన వనపర్తిలో కళలకు మరింత ప్రో త్సాహం అందిస్తామని, జిల్లాగా ఏర్పాటు కావడంతో మరింత ప్రాధాన్యత పెరిగిందన్నారు. కార్యక్రమంలో సాహిత్య కళాసభ్యులు బైరోజు చంద్రశేఖర్, సత్తార్, శివలింగం, ప్రసన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ..
వనపర్తి, అక్టోబర్ 6 : బాధితులకు సీఎం సహాయనిధి నుంచి విడుదలైన చెక్కులను బుధవారం క్యాంపు కార్యాలయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి అందజేశారు. చె క్కులు అందుకున్న వారిలో వనపర్తికి చెందిన సవారమ్మకు రూ.60వేలు, కవితకు రూ. 60వేలు, తాడిపర్తికి చెందిన కురుమూర్తికి రూ.60వేలు, అన్నారానికి చెంది న సునీతకు రూ.60 వేలు, పామిరెడ్డిపల్లికి చెందిన శివలక్ష్మికి రూ.16వేల చెక్కులను అందజేశారు.