ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 4 : కరోనా రోజుకు ఒకటి రెండు చొప్పున డివిజన్లో కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నది. జనసంచారం ప్రాంతాల్లో విందులు, వినోదాలతో పాటు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని నిబంధనలు పాటించడంలేదు. ప్రభుత్వం కరోనా కట్టడిపై దృష్టి సారించింది. జాగ్రత్తలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.
నిబంధనలు పాటించాలి..
కరోనా వ్యాప్తి పెరిగిపోతున్నప్పటికీ నిబంధనలు పాటించడంలో ప్రజలు తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఏసీపీ బాలకృష్ణరెడ్డి సమక్షంలో నియోజకవర్గంలోని అన్ని పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్సైలు, పోలీసుసిబ్బంది ఆధ్వర్యంలో ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా సామూహిక కార్యక్రమాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. నియోజకవర్గంలో మాస్కులు దరించని 50మందికి జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు.