యాదాద్రి, నవంబర్ 3 : ఆలేరు నియోజకవర్గం పాడి సంపదకు పెట్టింది పేరని, పాల ఉత్పత్తిలో రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎన్డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కాచారం గ్రామం లో పశు వైద్య శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గంలో ఎనిమిది పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో రూ. 17కోట్ల పంట రుణాలు అందించామన్నారు. 25పైసల వడ్డీతో రైతులకు రుణాలు ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ పార్టీదేనని పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించి కేవలం 65లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని పేర్కొందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.32కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసినా చేయకపోయినా రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ రైతులు పండించిన చివరి గింజ వరకూ కొంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వరి సాగు చేయవద్దని వస్తున్న వార్తలు అవాస్తమన్నారు. రైతులు ఇతర పంటలపై దృష్టిసారించి లాభాలు గడించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కరోనా కష్టకాలంలో సైతం రైతుబంధును అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబీమా పంట రుణాలు, 24గంటల నాణ్యమైన విద్యుత్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్ వంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ప్రజలకు చేరువైందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, ఎంపీపీ చీర శ్రీశైలం, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంచంద్రారెడ్డి, జిల్లా పశువైద్యాధికారి కృష్ణ, మదర్‌డెయిరీ డైరెక్టర్లు కల్లెపల్లి శ్రీశైలం, కందాల అలివేలు, కాచారం సర్పంచ్ కొండెం అరుణాఅశోక్రెడ్డి, ఎంపీటీసీ ఎడ్ల సుగుణ పాల్గొన్నారు.
నిరుపేదలకు వరం సీఎం సహాయనిధి
ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరం లాంటిందని ఎన్డీసీసీబీ చైర్మన్ మహేందర్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరు గ్రామానికి చెందిన గుర్రం మహేందర్‌కు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ. 97,500 చెక్కును లబ్ధిదారుడికి బుధవారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు.