
భద్రాచలం, నవంబర్ 3: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలోని బేడా మండపంలో బుధవారం ఉత్సవ మూర్తులకు అభిషేక తిరుమంజనం నిర్వహించారు. రంగనాయకుల గుట్టపై ఉన్న రంగనాథ స్వామికి అభిషేకం జరిపారు. తెల్లవారుజామున రామయ్యకు సుప్రభాతం, ఆరాధన, సేవాకాలం, నిత్య హోమం, పూజలు చేశారు. నిత్యకల్యాణమూర్తులను బేడా మండపంలో ఉంచి విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్ఛారణల నడుమ కన్యాదానం, బ్రహ్మముడి, జీలకర్ర, బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక, మంగళాష్టకంతో శాస్ర్తోక్తంగా నిత్యకల్యాణం నిర్వహించారు.