కేంద్ర మంత్రి సర్భానందసోనోవాల్
కన్హాశాంతి వనంలో యోగా పుస్తకం ప్రారంభోత్సవానికి హాజరు
75 కోట్ల సూర్య నమస్కారాల ప్రాముఖ్యతను వివరించిన యోగా గురువు రామ్‌దేవ్‌బాబా
హాజరైన హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రామచంద్రమిషన్ నిర్వాహకులు దాజీ
షాద్‌నగర్/నందిగామ, జనవరి 03: యోగా శిక్షణలో కొత్త నైపుణ్యాన్ని నెలకొల్పడానికి హార్ట్ఫుల్నెస్ ఇంటర్నేషనల్ యోగా అకాడమీ సహకరిస్తుందని కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి సర్భానందసోనోవాల్ అన్నారు. సోమవారం సాయంత్రం నందిగామ మండలం కన్హాశాంతి వనం గ్రామంలోని రామచంద్రమిషన్ యోగా ఆడిటోరియంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ యోగా అకాడమీ, 75కోట్ల సూర్య నమస్కాల ప్రాజెక్ట్, అథెంటిక్ యోగా పుస్తకం ప్రారంభోత్సవంలో ఆయన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, యోగా గురువు రామ్‌దేవ్‌బాబా, శ్రీ రామచంద్రమిషన్ అధ్యక్షుడు దాజీతో కలిసి పాల్గొన్న అనంతరం మాట్లాడారు. యోగా కేంద్రంలోని ప్రతి హాల్లో 100మంది యోగా విద్యార్థులకు వసతి కల్పించడంతో పాటు యోగా, వైద్య సేవలు, శిక్షణ తరగతులు కల్పించడం సంతోషకమరమన్నారు. యోగా యొక్క నిజమైన స్పూర్తి ప్రపంచానికి అందించడానికి ఆయా దేశాల సంస్థలు ముందుకు రావాలని, అందుకు హార్ట్ఫుల్నెస్ అకాడమీ సహకరిస్తుందని చెప్పారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం..
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. యోగా అనేది మన ప్రాచీన జ్ఞానుల నుంచి సంపూర్ణ శ్రేయస్సు కోసం మనకు అందించిన పవిత్ర శాస్త్రం అని అభిప్రాయపడ్డారు. యోగాను మన జీవితంలో అంతర్భాంగా స్వీకరించవల్సిన అవసరం ఉందని, ప్రమాణీకమైన జీవన విధానానికి యోగా పుస్తకం సరిపోతుందని అన్నారు.
ది అథెంటిక్ ఆఫ్ యోగా పుస్తకం యోగాను నేర్పుతుంది..
ది అథెంటిక్ ఆఫ్ యోగా అనే పుస్తకం మనిషికి యోగాను నేర్పుతుందని శ్రీ రామచంద్రమిషన్ అధ్యక్షుడు దాజీ అన్నారు. ది అథెంటిక్ యోగా పుస్తకాన్ని పీవై దేశ్‌పాండే 70లోనే రచించారని మహారాష్ట్రలో అతని కాలంలో ఒక ప్రధాన సాహిత్య శక్తి, తీవ్రమైన దృక్పదంతో ప్రపంచ దృష్టిలో ఆలోచన పరుడిగా నిలిచారని చెప్పారు. పతాంజలి, యోగా సూత్రాలపై గొప్ప జ్ఞానిగా చాల వాఖ్యాలను రాశారని, ఈ పుస్తకమంత జ్ఞానవంతమైందని చెప్పారు.
యోగా ప్రాముఖ్యతను తెలుసుకోవాలి..
యోగా ఆవశ్యకత, ప్రయోజనాలు, ఆరోగ్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటుదామని పతాంజలి ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు, యోగా గురువు స్వామి రామ్‌దేవ్‌బాబా అన్నారు. యోగాతో ఐక్యత ఆలోచన ప్రతిబింబిస్తుందని, యోగా యొక్క పూరాతన శాస్త్రన్ని సంరక్షించడంలో, ప్రచారం చేయడంలో శ్రీ రామచంద్రమిషన్ నిర్వహకులు దాజీ ముందున్నారని అభిప్రాయపడ్డారు. 75కోట్ల సూర్య నమస్కారాల ప్రాజెక్టు పేరుతో యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియపరిచేలా 75కోట్ల సూర్య నమస్కారా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆదర్శనీయమని కొనియాడారు. వచ్చే నెల 20వరకు రోజుకు 13సార్లు సూర్య నమస్కారాలు చేసే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐదు అంతర్జాతీయ సంస్థలు, హార్ట్ఫుల్నెస్ ఇన్సిట్యూట్ అకాడమీ, పతాంజలి యోగా ఫీట్, నేషన్ల్ యోగాఆశన స్పోర్ట్స్ ఫెడరేషన్, గీతా పరివార్, క్రీడ భారతీ, కేంద్ర ఆయుష్ విభాగం, కేంద్ర విద్య మంత్రిత్వశాఖ విభాగం, విదేశి వ్యవహరాల మంత్రిత్వశాఖ, దేశ యువజన వ్యవహరాలు, క్రీడలశాఖల సహకారంతో 75కోట్ల సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తామన్నారు.
నేటి తరం యువత యోగా ఆసక్తి చూపాలి
నేటి తరం యువత ఆరోగ్య సంరక్షణలో భాగంగా యోగాపై ఆసక్తి చూపాలని హర్యాన గవర్నర్ బండారు దత్తత్రేయ అభిప్రాయపడ్డారు. 75కోట్ల సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని రామచంద్రమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాల ప్రజలు పాల్గొన్నాలని కోరారు. పీవై దేశ్‌పాండే రచించిన ది అథెంటిక్ యోగా ఆఫ్ పతాంజలి అనే పుస్తకాన్ని అన్ని వర్గాల ప్రజలు చదవాలని, పుస్తకంలో ఉన్న విషయాలపై అవగాహన పెంచుకుని మెరుగైన జీవన విధానానికి అలవాటు పడాలని కోరారు.