మొయినాబాద్, జనవరి 3 :నేటి తరం మహిళలకు సావిత్రిబాయి ఫూలే స్ఫూర్తిదాయకమని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బేగరి రాజు అన్నారు. సావిత్రీబాయి జయంతి సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆమె చిత్ర పటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఎదిగి నేటితరం మహిళా మూర్తులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ప్రవీణ్, స్వేరో జిల్లా నాయకులు సురేశ్, సీపీఐ మండల కార్యదర్శి శ్రీనివాస్, రజక సంఘం చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షుడు నర్సింహులు, అంబేద్కర్ సంఘం నాయకులు యాదయ్యముదిరాజ్, వెంకటేశ్, విక్రంరెడ్డి, అమరేందర్‌రెడ్డి, రాజు పాల్గొన్నారు.
నందిగామ మండల కేంద్రంలో..
నందిగామ, జనవరి 3: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సావిత్రిబాయి ఫూలే జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, సర్పంచ్ వెంకట్‌రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ రాములు, ప్రధానోపాధ్యాయుడు దినేష్, రత్నయ్య, నాయకులు శ్రీశైలం యాదవ్, రాజీవ్‌రెడ్డి పాల్గొన్నారు.
కేశంపేటలో
కేశంపేట, జనవరి 3: మండల కేంద్రంలో సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు బాబయ్య, నర్సింహ్మయాదవ్, శ్రీనివాస్, రఘురామ్గౌడ్, పాండురంగారెడ్డి, హరికృష్ణ, శేఖర్‌యాదవ్, ఐలయ్య, రాజునాయక్, నరేందర్‌రెడ్డి, కుమార్, తిరుపతి, గోపాల్‌రెడ్డి, శివాజీ, కృష్ణ, శ్రీకాంత్, మహేష్, సందీప్ పాల్గొన్నారు.
సావిత్రిబాయిఫూలే సేవలు చిరస్మరణీయం
షాద్‌నగర్‌టౌన్, జనవరి 3 : మహిళలకు విద్యనందించడానికి సావిత్రిబాయిఫూలే చేసిన సేవలు చిరస్మరణీయమని బీసీ సంక్షేమ సంఘం దక్షిణ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మద్దూరి అశోక్‌గౌడ్ అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం సమీపంలో ఉన్న సావిత్రిబాయిపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు రాములు, శ్రీను, మురళీమోహన్, రాజు, శ్రీను, రఘు, శంకర్, రాజేందర్, బాలు, రవి, సాయి, శశి పాల్గొన్నారు.
సావిత్రిబాయిఫూలే అడుగుజాడల్లో నడువాలి
కడ్తాల్, జనవరి 3 : విద్యతోనే మహిళల అభ్యున్నతి సాధ్యమని, సావిత్రిబాయిఫూలే అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడువాలని బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు పిప్పళ్ల వెంకటేశ్, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు చందోజీ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బీసీ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయిపూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ లాయక్‌అలీ, నాయకులు జహంగీర్‌అలీ, మహేశ్, రాంచందర్, రాంచంద్రయ్య, రాఘవేందర్, రవి, మల్లేశ్‌గౌడ్, కృష్ణ, వెంకటయ్యగౌడ్, దాసు, భగీరథ్, శంకర్, రాజేశ్, నాగారాజు, లక్ష్మీనారాయణ, శ్రీకాంత్, రాజేందర్‌గౌడ్, రాజు, శేఖర్, భూపాల్, హరీశ్‌గౌడ్ పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ ప్రభుత్వ పాథమిక పాఠశాలలో..
అబ్దుల్లాపూర్‌మెట్, జనవరి 3 : మండల పరిధిలోని బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ అబ్దుల్లాపూర్‌మెట్ అధ్యక్షుడు గుండె రవీందర్, టీఆర్ఎస్ గ్రామశాఖ కార్యదర్శులు తోర్పునూరి శ్రీశైలంగౌడ్, టి వేణు, ఎఫ్ఎస్సీఎస్ డైరక్టర్ గుండె సత్యనారాయణ, నాయకులు బి.శ్రీనివాస్‌గౌడ్, ఎస్డి. నవాజ్‌పాషా, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సింహమూర్తి, ఉపాధ్యాయులు ఉన్నారు.
వీరన్నపేట ప్రభుత్వ పాఠశాలలో..
కొందుర్గు, జనవరి 3: జిల్లెడు చౌదరిగూడ మండలంలోని వీరన్నపేట ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయి ఫూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఫూలే చిత్ర పటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఈశ్వర్రావు, సమంత, విజయలక్ష్మి, సీఆర్పీ కాళీదాసు, వాలంటీర్లు ప్రవీణ, హజీరా, చిన్నయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం మండలంలో..
ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 3 : మహాత్మా సావిత్రిబాయిఫూలే జయంతిని ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల మున్సిపాలిటీ, మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పరమేశ్ ఆధ్వర్యంలో ఫూలే చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శేరిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ఆమె జయంతిని నిర్వహించారు.