వికారాబాద్, అక్టోబర్2: మహాత్ముడు చూపిన బాటలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆమె గాంధీ జయంతిని పురస్కరించుకుని వికారాబాద్ పట్టణంలోని గాంధీ పార్కులో గాంధీ విగ్రహానికి, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాలకు ఎమ్మెల్యేలు డాక్టర్ ఆనంద్, కాలె యాదయ్యలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడు తూ అందరం గాంధీజీ బాటలోనే ముందు కు సాగాలని, ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం వైపు ప్రోత్సహిస్తున్నదన్నారు. అనంతరం మున్సిపల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ ప్రశం సాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ నిఖిల, మున్సిపల్ చైర్పర్సన్ మంజు ల, జడ్పీటీసీ ప్రమోదిని, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ముద్ద దీప, అదనపు కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ శంషాద్‌బేగం, మా ర్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్, మాజీ జడ్పీటీసీ షరీఫ్, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, నవీన్‌కుమార్, చందర్‌నాయక్, కిరణ్పటేల్, రామస్వామి పాల్గొన్నారు.
గ్రామ స్వరాజ్యానికి కృషి చేయాలి
షాబాద్, అక్టోబర్2: మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా అందరం కలిసి కృషి చేయాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్‌కుమార్ అన్నారు. శనివారం గాంధీజీ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో అహింసామార్గాన్ని ఎంచుకుని గాంధీజీ విజయం సాధించారని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తిరుపతిరావు, డీఆర్వో హరిప్రియ, ఏవో ప్రమీ ల, పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.