రూ.13 లక్షల నగదు రికవరీ
పోలీసులకు సీఐ అభినందన
ఆమనగల్లు, ఫిబ్రవరి 1: మూఢ విశ్వాసాలను ఆసరాగా చేసుకుని ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు బురిడీ బాబాలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మాడ్గుల సీఐ కృష్ణమోహన్ తెలిపారు. మంగళవారం పోలీస్‌స్టేషన్ ఆవరణ లో ఆయన వివరాలను వెల్లడించారు. సూర్యాపేట జిల్లా, పెన్నపహాడ్ మండలం అన్నారం గ్రామానికి చెందిన ముగ్గురు బురిడీ బాబాలు పార్వతం స్వామి, పార్వతం సైదులు, సిరిసిల్ల బక్కయ్య అలియాస్ బాలకృష్ణారెడ్డి సులభంగా డబ్బు సంపాదించేందుకు తమకు ఆయుర్వేద వైద్యం, జ్యోతిషం తెలుసంటూ ప్రజలను మో సం చేస్తున్నారు. తాము మంత్రించి ఇచ్చిన పసు పు, కుంకుమ చల్లితే జ్వరాలు మటుమాయం అవుతాయని, సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారని, మొండి రోగాల బాధ తగ్గుతుందని మాడ్గుల మండలంలోని కలకొండ, అందుగుల, అన్నెబోయిన్పల్లి గ్రామాలతోపాటు సమీపంలోని పలు గ్రామాల్లో కొంతకాలంగా సర్వరోగ నివారిణి పేరిట ప్రజలకు గారడీ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. ప్రజల మానసిక స్థితి, రోగాలను ఆసరాగా చేసుకొని వారి నుంచి భారీగా డ బ్బును వసూలు చేశారు. ఇటీవల బురిడీ బాబాలతో మోసపోయిన పలువురు బాధితుల ఫిర్యా దు మేరకు మాడ్గుల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా వారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆయా గ్రామాల్లో పూజల పేరిట రూ.20 లక్షల వరకు నగదు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. బురిడీ బాబాల నుం చి పూజా సామగ్రితోపాటు రూ.13 లక్షల నగదును రికవరీ చేసి వారిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ రమేశ్, కానిస్టేబుళ్లు బాలకృష్ణ, విజయ్‌లను సీఐ అభినందించారు.