
మెదక్ మున్సిపాలిటీ,పాపన్నపేట, నవంబర్ 30 : విద్యార్థులు కష్టంగా కాకుండా ఇష్టంతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని మెదక్ డీఎస్పీ సైదులు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్యా మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థుల నుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు ఇంటర్మీడియట్ కీలక మెట్టు అన్నారు. విద్యార్థులు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన గ్రీన్‌కోర్ సర్టిఫికెట్లను డీఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌గౌడ్ అధ్యాపకులు పాల్గొన్నారు.
ఎల్లావేళలా అందుబాటులో ఉండాలి
పోలీసులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని మెదక్ డీఎస్పీ సైదులు సూచించారు. మంగళవారం ఆయన పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల పని తీరును, రికార్డులను, పోలీసు పరేడ్‌ను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట రూరల్ సీఐ పాలవెల్లితో పాటు పాపన్నపేట ఎస్సై సురేశ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.