యాచారం, జనవరి 31 :టీఆర్ఎస్ అభివృద్ధి కోసం కష్టపడే కార్యకర్తలకు భవిష్యత్‌లో సముచిత స్థానం ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సోమవారం వివిధ మండలాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ఆయనను క్యాంపు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
టీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ నాయకులు ఖాజు మహ్మద్ ఆధ్వర్యంలో మండల మైనార్టీ నాయకులు ఎమ్మెల్యేని కలిశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు పుష్పగుచ్ఛ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో 4,5 తేదీల్లో నిర్వహించే ఉర్సు ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, నాయకులు యాదయ్య, భాస్కర్, ఆనంద్, జమాల్, అప్సర్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడికి సన్మానం
అబ్దుల్లాపూర్‌మెట్ : రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితులైన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు వినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం క్యాంపు కార్యాలయంలో కలిసి గజమాలతో సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యువజన విభాగం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, నాయకులు వెంకటేశ్‌యాదవ్, రాఘవేందర్‌గౌడ్, జంగయ్యయాదవ్, ఉమాకాంత్చారి, ఎండీ ఇమ్రాన్, ఎం కొండల్, ప్రకాశ్, అఖిల్, వినోద్, ఇంతియాజ్, సాయి తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం
హయత్‌నగర్ రూరల్ : టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి పాశం దామోదర్, సీనియర్ నాయకులు దేవిడి విజయభాస్కర్‌రెడ్డి, తొండాపు బ్రహ్మానందరెడ్డి, చెవుల చిరంజీవి తదితరులు ఎమ్మెల్యేను సత్కరించారు. మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.